ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

PM Modi: నెలాఖరులో ప్రధాని నరేంద్రమోదీ తమిళనాడు పర్యటన

ABN, Publish Date - Jul 12 , 2025 | 11:09 AM

ప్రధాని నరేంద్రమోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఈ నెల 27న రాష్ట్రానికి విచ్చేయనున్నారు. గంగైకొండ చోళపురంలో జరిగే వేడుకల్లో ఆయన ముఖ్య అథిగా పాల్గొననున్నారు. ఐదు రోజులపాటు విదేశీ పర్యటన ముగించుకుని గురువారం ఆయన ఢిల్లీకి తిరిగొచ్చారు. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరున రాష్ట్రంలో పర్యటించేందుకు వస్తున్నారని అధికార వర్గాలు తెలిపాయి.

చెన్నై: ప్రధాని నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) రెండు రోజుల పర్యటన నిమిత్తం ఈ నెల 27న రాష్ట్రానికి విచ్చేయనున్నారు. గంగైకొండ చోళపురంలో జరిగే వేడుకల్లో ఆయన ముఖ్య అథిగా పాల్గొననున్నారు. ఐదు రోజులపాటు విదేశీ పర్యటన ముగించుకుని గురువారం ఆయన ఢిల్లీకి తిరిగొచ్చారు. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరున రాష్ట్రంలో పర్యటించేందుకు వస్తున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ నెల 26న కేరళ రాజధాని తిరువనంతపురంలో జరిగే ప్రభుత్వ కార్యక్రమంలో నరేంద్రమోదీ పాల్గొంటారు.

అక్కడి నుంచి మరుసటి రోజు ఆయన రాష్ట్రానికి రానున్నారు. అరియలూరు జిల్లా గంగైకొండ చోళపురంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బృహదీశ్వరాలయాన్ని చోళచక్రవర్తి రాజేంద్ర చోళుడు నిర్మించారు. ఆ ఆలయంలో ఈ నెల 27న ఆషాఢ ఆరుద్ర మహోత్సవాలు నిర్వహించనున్నారు. రాజేంద్ర చోళుడి జయంతి కూడా ఆరోజే కావడంతో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గత నాలుగేళ్లుగా ఈ వేడుకలను జరుపుతున్నారు.

ఈ యేడాది జరుగనున్న ఆషాఢ ఆరుద్ర మహోత్సవాలకు ప్రధాని మోదీ రావడానికి అంగీకరించినట్లు సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. రాజేంద్ర చోళుడి జయంతి, గంగకొండై చోళపురాన్ని నిర్మించి వెయ్యేళ్లు, దక్షిణాది దేశాలు, ఆగ్నేయ ఆసియా దేశాలపై దండెత్తి వెయ్యేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని త్రివిధ మహోత్సవాలు జరుగనున్నాయి.

ఈ నేపథ్యంలో గంగైకొండ చోళపురం వద్ద ప్రధాని భద్రతా విభాగం ఉన్నతాధికారులు, అరియలూరు జిల్లా కలెక్టర్‌, పోలీసు ఉన్నతాధికారులు భద్రతా ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు. ఈ వేడుకల తర్వాత 28న ప్రధాని తంజావూరులో పర్యటించనున్నారు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే ఈ వేడుకల్లో ప్రధాని మోదీతోపాటు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ కూడా పాల్గొంటారని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

ఈ వార్తలు కూడా చదవండి.

రోజు రోజుకు పెరుగుతున్న బంగారం ధరలు.. ఈ రోజు ఎంతంటే..

తెలంగాణలో అమిత్ షా పర్యటన షెడ్యూల్ ఇదే..

Read Latest Telangana News and National News

Updated Date - Jul 12 , 2025 | 11:09 AM