Pehalgam Terror Attack: కాందహార్ హైజాకర్ ఇంట్లో సోదాలు
ABN, Publish Date - May 02 , 2025 | 01:31 PM
Pehalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడి కేసును ఎన్ఐఏ తన దర్యాప్తును ముమ్మరం చేసింది. అందులోభాగంగా దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానాన్ని కాందహార్‌కు హైజాక్ చేసిన హైజాకర్ ఇంట్లో సోదాలు చేపట్టింది.
శ్రీనగర్, మే 02: పహల్గాం దాడి అనంతరం కశ్మీర్‌లో భద్రతా దళాలు గాలింపు చర్యలను మరింత వేగవంతం చేశాయి. ఐసీ 814 విమానాన్ని హైజాక్ చేసిన అల్ ఉమర్ ముజాహిద్దీన్ చీఫ్ ముష్తాక్ అహ్మద్ జర్గర్‌ను ఉగ్రవాదులు విడిపించారు. ఈ నేపథ్యంలో అతని నివాసంలో శుక్రవారం భద్రతా దళాలు సోదాలు చేపట్టాయి. కీలక ఆధారాల కోసం ఈ సోదాలు చేపట్టారు. ఈ ఉగ్రదాడికి కర్మ, కర్త, క్రియ అంతా పాకిస్థానేనని ఇప్పటికే ఎన్ఐఏ తన ప్రాధమిక దర్యాప్తులో స్పష్టం చేసింది. ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో పాక్ ఈ దాడి చేయించిందని పేర్కొంది. అదీకాక అల్ ఉమర్ ముజాహిద్దీన్ చీఫ్ ముష్తాక్ అహ్మద్ జర్గర్ ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంటున్నాడు.అతడికి, ఈ దాడికి ఏమైనా సంబంధాలుండే అవకాశముందని ఎన్ఐఏ భావిస్తోంది. అందులోభాగంగా అతడి ఇంటిలో ఈ తనిఖీలు చేపట్టింది.
ఏప్రిల్ 22వ తేదీన పహల్గాంలో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26 మంది మరణించారు. ఈ ఘటనను భారత్ సీరియస్‌గా తీసుకొంది. దీంతో పాకిస్థాన్‌పై భారత్ ఆంక్షలు విధించింది. ఇక పాకిస్థాన్ సైతం అదే రీతిలో స్పందించింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఈ దాడికి తామే బాధ్యులమంటూ ఇప్పటికే లష్కరే తోయిబాకు చెందిన అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించింది. దీంతో ఈ దాడి వెనుక లష్కరే తోయిబా చీఫ్ హాఫీజ్ సయిద్ ఉన్నట్లు భారత్ భావిస్తుందని పాక్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో అతడికి నాలుగంచల భద్రతను ఏర్పాటు చేసింది. ఇక ఎన్ఐఏ దర్యాప్తులో భాగంగా వేలాది మందిని ప్రశ్నించింది. పలువురు అనుమానితులను కస్టడీలోకి తీసుకొని విచారించింది.దీంతో ఈ ఉగ్రదాడిపై ఎన్ఐఏ ఒక ప్రాధమిక నివేదికను విడుదల చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
Canada Election 2025: ఎన్నికల్లో 22 మంది పంజాబీ ఎంపీలు ఘన విజయం
Pahalgam Terror Attack: ఎన్ఐఏ నివేదిక.. వెలుగులోకి సంచలన విషయాలు
Heavy Rains: న్యూఢిల్లీలో రెడ్ అలర్ట్..విమాన సర్వీసులపై ఎఫెక్ట్
Pakistan Vs India: పాకిస్థాన్‌కు గట్టిగా బదులిస్తున్న భారత్
Ambulance: అంబులెన్స్‌లో ఏం తరలిస్తున్నారో తెలిస్తే.. షాక్ అవాక్కవాల్సిందే..
Pahalgam Terror Attack: హఫీజ్ సయిద్ భద్రత పెంచిన పాక్
For National News And Telugu News
Updated Date - May 02 , 2025 | 01:52 PM