Canada Election 2025: ఎన్నికల్లో 22 మంది పంజాబీ ఎంపీలు ఘన విజయం
ABN , Publish Date - May 02 , 2025 | 01:03 PM
Canada Election 2025: కెనడాలో జరిగిన పెడరల్ ఎన్నికల్లో పంజాబీలు తమ సత్తా చాటారు. ఒకరు ఇద్దరు కాదు..ఏకంగా 22 మంది ఎంపీలుగా ఘన విజయం సాధించారు. దీంతో దేశంలో విధానాల రూపకల్పనలో వీరి పాత్ర అత్యంత కీలకం కానుంది.
అట్టావా, మే 02: కెనడాలో జరిగిన ఫెడరల్ ఎన్నికల్లో పంజాబీలు తమ సత్తా చట్టారు. ఈ ఎన్నికల్లో 22 మంది పంజాబీలు కామన్స్ సభకు ఎన్నికయ్యారు. తద్వారా పంజాబీ సమాజం చరిత్ర సృష్టించింది. దీంతో ఆ పార్లమెంట్‌లో 6 శాతం మంది ఎంపీలు ఆ సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు అయింది. దీని ద్వారా కెనడా దేశ రాజకీయాల్లో పంజాబీల ప్రాతినిధ్యం రోజురోజుకు పెరుగుతోన్నట్లు సష్టమవుతోంది. బ్రాంప్టన్ నగరంలో పంజాబీల ప్రాబల్యం అధికంగా ఉంది. ఈ నగరంలోని ఐదు నియోజకవర్గాల నుంచి లిబరల్, కన్జర్వేటివ్ పార్టీల అభ్యర్థులుగా పంజాబీలు బరిలో నిలిచి గెలవడం విశేషం.
లిబరల్ పార్టీ అభ్యర్థి రూబీ సహోటా బ్రాంప్టన్ నార్త్‌లో కన్జర్వేటివ్ అభ్యర్థి అమన్‌దీప్ జడ్జ్‌ను ఓడించారు. లిబరల్ పార్టీ అభ్యర్థి మణిందర్ సిద్ధు బ్రాంప్టన్ ఈస్ట్‌లో కన్జర్వేటివ్ అభ్యర్థి బాబ్ దోసాంజ్‌ను ఓటమి పాలు చేశారు. బ్రాంఫ్టన్ సౌత్ నుంచి లిబరల్ పార్టీకి చెందిన అభ్యర్థి సోనియా సిద్ధును కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థి సుఖ్‌దీప్ కాంగ్ ఓడించారు.
ఇక బ్రాంప్టన్‌లోనే కాకుండా.. ఇతర పంజాబీ కెనడియన్ రాజకీయ నేతలు సైతం విజయాలు అందుకున్నారు. మాజీ మంత్రి అనితా ఆనంద్ ఓక్‌విల్లే ఈస్ట్‌లో తన స్థానాన్ని నిలుపుకున్నారు. సీనియర్ రాజకీయ నాయకురాలు బర్దిష్ చాగర్ సైతం వాటర్‌లూలో ఘన విజయాన్ని అందుకొన్నారు. లిబరల్ పార్టీ నుంచి అంజు ధిల్లాన్, సుఖ్ ధాలివాల్, రణదీప్ సారాయ్, పరమ్ బెయిన్స్ విజయం సాధించిన వారి జాబితాలో ఉన్నారు. అదే విధంగా జస్రాజ్ హల్లన్, దల్విందర్ గిల్, అమన్‌ప్రీత్ గిల్, అర్పాన్ ఖన్నా, టిమ్ ఉప్పల్, పరమ్ గిల్, సుఖ్మాన్ గిల్,జగషారన్ సింగ్ మహల్, హర్బ్ గిల్ తదితరులు కన్జర్వేటివ్ పార్టీ తరఫున విజయం సాధించారు.
న్యూ డెమోక్రటిక్ పార్టీ అధినేత జగ్మీత్ సింగ్ బర్నాబీ సెంట్రల్‌లో తన స్థానాన్ని కోల్పోయారు. ఈ ఎన్నికల్లో బర్నాబీ మూడవ స్థానంలో నిలిచారు. దీంతో ఎన్‌డీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. 2025 ఎన్నికల్లో పంజాబీ కెనడియన్లు ఘన విజయం సాధించడం ద్వారా.. ఆ దేశంలో విధానాల రూపకల్పనలో వీరి పాత్ర అత్యంత కీలకమవనున్నది సుస్పష్టమవుతోంది
ఈ వార్తలు కూడా చదవండి..
Pahalgam Terror Attack: ఎన్ఐఏ నివేదిక.. వెలుగులోకి సంచలన విషయాలు
Heavy Rains: న్యూఢిల్లీలో రెడ్ అలర్ట్..విమాన సర్వీసులపై ఎఫెక్ట్
Pakistan Vs India: పాకిస్థాన్‌కు గట్టిగా బదులిస్తున్న భారత్
Ambulance: అంబులెన్స్‌లో ఏం తరలిస్తున్నారో తెలిస్తే.. షాక్ అవాక్కవాల్సిందే..
Pahalgam Terror Attack: హఫీజ్ సయిద్ భద్రత పెంచిన పాక్
For International News And Telugu News