ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Pavithra Gowda Arrest: రేణుకాస్వామి హత్య కేసులో నటి పవిత్ర గౌడ అరెస్ట్..

ABN, Publish Date - Aug 14 , 2025 | 04:38 PM

రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ స్టార్‌ నటుడు దర్శన్, అతడి ప్రియురాలు పవిత్ర గౌడ సహా 7 మంది నిందితుల బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. దీంతో పోలీసులు మరోసారి పవిత్ర గౌడను అరెస్టు చేశారు.

Pavithra Gowda Arrested in Renukaswamy Murder Case

Renukaswamy Murder Case: దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన రేణుకా స్వామి హత్య కేసులో తాజాగా కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న నటి పవిత్రా గౌడను గురువారం బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. సుప్రీంకోర్టు, కర్ణాటక హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసిన వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

సుప్రీం కోర్టు ఆదేశంతో అరెస్టు

ఈ కేసులో పవిత్రా గౌడకు కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే, కర్ణాటక ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP) పై గురువారం (ఆగస్టు 14) విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం బెయిల్‌ను రద్దు చేస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. 'హైకోర్టు తీర్పులో స్పష్టమైన లోపాలు ఉన్నాయి. ఆమెకు బెయిల్ ఇవ్వడానికి సరైన న్యాయ కారణాలు లేవు' అని జస్టిస్ జేబీ పార్దివాలా,ఆర్ మహాదేవన్ ధర్మాసనం అభిప్రాయపడింది. దీని తర్వాత పోలీసులు నటి పవిత్ర గౌడను ఆమె ఇంటి వద్ద అరెస్టు చేశారు.

దర్శన్ బెయిల్ కూడా రద్దు

ఈ కేసులో రెండో నిందితుడు అయిన కన్నడ స్టార్ నటుడు దర్శన్ తూగుదీపకు మంజూరైన బెయిల్‌ను కూడా సుప్రీంకోర్టు అదే రోజున రద్దు చేసింది. 'అతనికి బెయిల్ ఇస్తే న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసం దెబ్బతింటుంది' అంటూ ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దర్శన్‌ను మైసూర్‌లో అరెస్ట్ చేయగా.. పవిత్రా గౌడను బెంగళూరులోని ఆర్‌ఆర్‌నగర్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో సుప్రీంకోర్టు మొత్తం 7 మంది నిందితుల బెయిల్ రద్దు చేసింది.

కోర్టు కీలక సూచనలు

సుప్రీం ధర్మాసనం రేణుకాస్వామి హత్య కేసులో నిందితులను వెంటనే కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులను ఆదేశించడంతో పాటు.. కింది కోర్టులో విచారణను వేగవంతం చేయాలని సూచించింది. అలాగే, నిందితులకు జైలులో ప్రత్యేక సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం లేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

2024 జూన్‌లో రేణుకా స్వామి అనే వ్యక్తి పవిత్రా గౌడకు అసభ్య మెసేజ్‌లు పంపాడన్న కారణంగా.. నటుడు దర్శన్, పవిత్రా గౌడ, మరికొందరు కలిసి అతడ్ని కిడ్నాప్ చేసి బెంగళూరులోని ఓ షెడ్‌లో మూడు రోజులపాటు నిర్బంధించి చిత్రహింసలు పెట్టారు. హింసను తట్టుకోలేక రేణుకా స్వామి మరణించడంతో.. అతడి మృతదేహాన్ని మురికి కాలువలో పడేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటివరకు దర్శన్, పవిత్రా గౌడతో పాటు మరో 15 మంది అరెస్ట్ అయ్యారు. ప్రజలు, పౌరసంఘాలు ఈ కేసులో న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నాయి. పవిత్రా గౌడ, దర్శన్ వంటి ప్రముఖులు ఇందులో ఉండటంతో ఈ కేసు మొదటి నుంచి వార్తలలో నిలుస్తోంది. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో దర్యాప్తు మరో దశలోకి ప్రవేశించినట్లయింది.

ఇవి కూడా చదవండి

ఆ 65 లక్షల మంది పేర్లను వెబ్‌సైట్‌లో పెట్టండి.. ఎలక్షన్ కమిషన్‌కు సుప్రీంకోర్టు ఆదేశం..

ధర్మస్థల కేసులో ఆశ్చర్యకర నిజాలు..ఆ 80 శవాలు నేనే పాతిపెట్టా..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 14 , 2025 | 05:37 PM