Operation Sindoor: మళ్లీ అడ్డంగా దొరికిన పాక్..
ABN, Publish Date - May 12 , 2025 | 05:14 PM
Operation Sindoor:కాశ్మీర్‌లో కల్లోలం సృష్టించేందుకు పాకిస్థాన్ ఎంత చేయాలో అంత చేస్తోంది. ఆ క్రమంలో పహల్గాంలో పర్యాటకులే లక్ష్యంగా కాల్పులు జరిపింది. దీంతో 26 మంది మరణించారు.
న్యూఢిల్లీ, మే 12: సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషించే క్రమంలో పాకిస్థాన్ తప్పుల మీద తప్పులు చేస్తోంది. తాజాగా ఆ దేశం మరో తప్పు చేస్తూ.. అడ్డంగా దొరికిపోయింది. అగ్రరాజ్యం అమెరికా ప్రకటించిన ఉగ్రవాది.. హాఫీజ్ అబ్దుర్ రవుఫ్‌ను మౌలానాగా చిత్రీకరించే ప్రయత్నాన్ని పాక్ చేసింది. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో మరణించిన ఉగ్రవాదులకు పాకిస్థాన్‌లో ఇటీవల అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హాఫీజ్ అబ్దుర్ రవుఫ్ మౌలానాగా వ్యవహరించారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అంతేకాదు.. ఈ ఆపరేషన్‌లో మరణించిన ఉగ్రవాదుల శవ పేటికలకు పాకిస్థాన్ జాతీయ జెండాలను చుట్టారు.
అదే సమయంలో హాఫీజ్ రవుఫ్ పక్కనే ఆర్మీ అధికారులు సైతం ఉన్నారు. అయితే మీడియా ముందుకు వచ్చే సమయంలో హాఫీజ్ టోపి ధరించాడు. ఆర్మీ అధికారులు సూచింన మేరకే అతడు టోపీ ధరించాడనే చర్చ అయితే జరుగుతోంది. హాపీజ్ రవుఫ్ చిత్రాలు బహిర్గతం కావడంతోొ.. భారత్ అధికారులు న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్పందించారు. ఈ ఫోటోను వివరిస్తూ.. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని బహిరంగంగా ప్రోత్సహిస్తుందనడానికి ఇది తిరుగులేని రుజువు అని వారు కుండ బద్దలు కొట్టారు.
మరోవైపు హాపీజ్ రవుఫ్ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఉగ్రవాద సంస్థలను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌పై సర్వత్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అంతేకాదు.. జైషే మహమ్మద్ మసూద్ అజార్ సోదరుడే ఈ హాఫీజ్ రవుఫ్. ఉగ్రవాదాన్ని బలోపేతం చేసేందుకు అతడు ఆర్థికంగా తోడ్పాటు అందిస్తారనే ఓ చర్చ అయితే చాలా కాలంగా నడుస్తోంది. అలాగే లష్కరే తోయిబా సంస్థ నిర్వహణ, ఆయుధాలు సమకూర్చడంలో హాఫీజ్ రవుఫ్ కీలక పాత్ర పోషిస్తారనే ప్రచారం నడుస్తోంది.
హాఫీజ్‌ను ఇలా చూపించడం ద్వారా పాకిస్థాన్ దృష్టి మరల్చే ప్రయత్నం చేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక ఈ అంశంపై భారత్ వెంటనే స్పందించి.. హాఫీజ్ వ్యవహారంలో పాక్ అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టింది. ఆ క్రమంలో హాఫీజ్ వివరాలను భారత్ సోదాహరణగా వివరించింది. అతడు ఎప్పుడు జన్మించాడు... అతని సీఎన్ఐసీ నెంబర్ సహా పలు వివరాలను సోదాహరణతో వివరించింది.
మరోవైపు హాఫీజ్ రవుఫ్.. లష్కరే తోయినా సంస్థ వ్యవస్థాపకుడు హాఫీజ్ సయిద్ ఆదేశాలకు అనుగుణంగానే పని చేస్తున్నాడని యూఎస్ ట్రేజర్ వెల్లడించింది. అంతేకాదు.. ఈ సంస్థలో చేరికలతోపాటు.. నిధులు సమకూర్చడంలో అతడు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాడని స్పష్టం చేసింది. ఫలాహ్ ఈ ఇన్సియాత్ ఫౌండేషన్‌లో అతడు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాడని అమెరికా సోదాహరణగా వివరించింది.
ఇవి కూడా చదవండి..
Operation Sindoor: పాక్ ఎయిర్ బేస్‌ల ధ్వంసం.. వీడియోలు విడుదల
Operation Sindoor: పాక్ దాడులను సమర్థంగా తిప్పికొట్టాం: ఎయిర్ మార్షల్ ఎ.కె. భార్తీ
India-Pakistan Ceasefire: భారత్, పాక్ చర్చలు సాయంత్రానికి వాయిదా
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ ముగియలేదు.. పాకిస్తాన్‌కు వార్నింగ్..
For National News And Telugu News
Updated Date - May 12 , 2025 | 05:16 PM