ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

INS Vikrant: ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ సముద్రంలో శత్రుదుర్భేద్య దుర్గం

ABN, Publish Date - May 09 , 2025 | 05:02 AM

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత నౌకాదళం అరేబియా సముద్రంలో ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ను తరలించి, పాకిస్థాన్‌ పై దాడికి సిద్ధమైంది. ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌, అనేక యుద్ధ నౌకలు, క్షిపణులతో పాకిస్థాన్‌పై తీవ్ర దాడులు జరిపేందుకు సన్నద్ధమైంది

  • పాకిస్థాన్‌పై పోరులో కీలకం

న్యూఢిల్లీ, మే 8: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో అరేబియా సముద్రంలోకి ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ యుద్ధవాహక నౌకను వారం కిందటే భారత నౌకాదళం తరలించింది. అరేబియా సముద్రం తీర ప్రాంతంలోనే పాకిస్థాన్‌లోని కరాచీ నగరం ఉంది. పాకిస్థాన్‌ మీద దాడికి సిద్ధంగా ఉన్న ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌.. గురువారం కరాచీ మీద నిప్పులు కురిపించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో,ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ విశేషాలు..ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ బరువు 45 వేల మెట్రిక్‌ టన్నులు. పొడవు 262 మీటర్లు. దానిపై ఒకేసారి 30 మిగ్‌ 29కే యుద్ధవిమానాలను నిలుపవచ్చు. ఒక్కో మిగ్‌ 800 కి.మీ.ల దూరంలో ఉన్న లక్ష్యాలను చేధించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. గగనతల నిఘా కోసం ఉపయోగించే కామోవ్‌-31 హెలికాప్టర్లను, యాంటీ సబ్‌మెరైన్‌ మిషన్‌ కోసం వాడే హాల్‌ ధ్రువ్‌ హెలికాప్టర్లనుఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ మీద మోహరిస్తారు. ఇక విక్రాంత్‌ రక్షణ కోసం దానిపై ఉపరితలం నుంచి గగనతలానికి దూసుకెళ్లే బరాక్‌-8 క్షిపణులు, ఈఎల్‌/ఎం-2248 ఎంఎఫ్‌‌ -స్టార్‌ వంటి అత్యాధునిక రాడార్లు ఉంటాయి. ఐఎన్‌ఎ్‌స విక్రాంత్‌ను శత్రు దుర్భేద్యంగా మార్చే ‘కారియర్‌ బాటిల్‌ గ్రూప్‌’ దాని వెంటే అంగరక్షకుల్లా ఉంటాయి. ఈ గ్రూప్‌లో కల్వరి క్లాస్‌ జలాంతర్గాములు, కోల్‌కతా క్లాస్‌ డిస్ట్రాయర్లు, తల్వార్‌ క్లాస్‌ ఫ్రిగేట్లు ఉంటాయి. వీటన్నింటితో ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌.. సముద్రంలో ఓ భారీకోటలా ముందుకు కదులుతుంది.


నిప్పులు చిమ్మే క్షిపణులు

కల్వరి క్లాస్‌ జలాంతర్గాముల్లో ఐఎన్‌ఎస్‌ కల్వరి, ఐఎన్‌ఎస్‌ వగీర్‌ సబ్‌మెరైన్లుంటాయి. వీటిలో శత్రునౌకలను ధ్వంసం చేసే క్షిపణులుంటాయి. ఒక క్షిపణి 3 వేల కిలోల బరువైన నౌకను కూడా తుత్తునియలు చేయగలదు. ఇక కోల్‌కతా క్లాస్‌ డిస్ట్రాయర్లలో బ్రహ్మోస్‌ సూపర్‌సానిక్‌ క్రూయిజ్‌ మిసైల్స్‌, 32 బరాక్‌-8 మిసైల్స్‌తో కూడిన ఐఎన్‌ఎస్‌ కోల్‌కతా, ఐఎన్‌ఎస్‌ చెన్నై యుద్ధనౌకలుంటాయి. ఇవి పాకిస్థాన్‌లోని నౌకాశ్రయాలను, చమురు డిపోలను, యుద్ధనౌకలను లక్ష్యంగా నిప్పులు కురిపించగలవు. తల్వార్‌ క్లాస్‌ ఫ్రిగేట్లలో ఐఎన్‌ఎస్‌ తల్వార్‌, ఐఎన్‌ఎస్‌ తేగ్‌, ఐఎన్‌ఎస్‌ త్రికాండ్‌ యుద్ధనౌకలుంటాయి. వీటిలో దాడికి సిద్ధంగా 8 బ్రహ్మోస్‌ క్షిపణులుంటాయి. వేగంగా కదులుతూ, తీరప్రాంతాల్లో దాడులు జరిపేందుకు, దాడికి అవసరమైన సహకారం అందించేందుకు ఫ్రిగేట్లు ఉపయోగపడుతాయి.

Updated Date - May 09 , 2025 | 08:07 AM