పాక్ 200 నిమిషాలపాటు దాడులు చేసింది: భారత్
ABN, First Publish Date - 2025-05-09T17:25:55+05:30
పాకిస్థాన్ నిర్వహించిన దాడులపై భారత్ కీలక ప్రకటన చేసింది. 4 రాష్ట్రాల్లోని 24 ప్రాంతాలను టార్గెట్ చేసి పాకిస్థాన్ దాడులు చేసిందని చెప్పింది. ఇందుకోసం..
ఢిల్లీ: పాకిస్థాన్ నిర్వహించిన దాడులపై భారత్ కీలక ప్రకటన చేసింది. 4 రాష్ట్రాల్లోని 24 ప్రాంతాలను టార్గెట్ చేసి పాకిస్థాన్ దాడులు చేసిందని చెప్పింది. ఇందుకోసం పాకిస్థాన్ 500 చిన్న డ్రోన్లను ఉపయోగించిందని పేర్కొంది.200 నిమిషాల పాటు ఈ దాడులు కొనసాగాయని భారత్ పేర్కొంది. 4 రాష్ట్రాల్లోని 24 ప్రాంతాలను టార్గెట్ చేసిన పాకిస్థాన్ .. మొత్తంగా 3 గంటల 20 నిమిషాల పాటు దాడి చేసిందని తెలిపింది. పాక్ టార్గెట్ చేసిన ప్రాంతాల్లో జమ్ము, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ ఉన్నాయని వెల్లడించింది. అయితే, పాక్ అన్ని డ్రోన్లను పూర్తిగా ధ్వంసం చేశామని భారత్ స్పష్టం చేసింది.
పాకిస్తాన్ సాయుధ దళాలు 2025 మే 08, 09 తేదీల మధ్య రాత్రి మొత్తం పశ్చిమ సరిహద్దు వెంబడి డ్రోన్లు, ఇతర మందుగుండు సామగ్రిని ఉపయోగించి అనేక దాడులను ప్రారంభించాయని పేర్కొంది. జమ్మూ కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి పాక్ దళాలు అనేక కాల్పుల విరమణ ఉల్లంఘనలను (CFV) చేశాయని కూడా చెప్పింది.
అయితే, ఈ డ్రోన్ దాడులన్నింటిని సమర్థవంతంగా తిప్పికొట్టామని, అటు,కాల్పుల విరమణ ఉల్లంఘనలకు తగిన సమాధానం ఇచ్చామని అధికారికంగా ప్రకటించింది భారత్. భారత సైన్యం దేశ సార్వభౌమత్వాన్ని, దేశ ప్రాదేశిక సమగ్రతను కాపాడటానికి కట్టుబడి ఉందని.. అన్ని దుర్మార్గపు కుట్రలకు తుత్తునియలు చేస్తామని కూడా తేల్చి చెప్పింది.
ఆపరేషన్ సిందూర్ కు సంబంధించి తాజాగా భారత్ మరిన్ని వివరాలు వెల్లడిస్తోంది.. లైవ్ చూద్దాం..
ఇవి కూడా చదవండి
Operation Sindoor: జవాన్ మురళీ నాయక్‌కు సీఎం చంద్రబాబు, లోకేష్ నివాళులు
Karachi Port Missile Strike: పాక్‌కు చావుదెబ్బ
Read Latest Telangana News And Telugu News
Read Latest AP News And Telugu News
Updated Date - 2025-05-09T17:48:23+05:30 IST