ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Operation Sindoor: పౌరులు, ఆలయాలపైనే పాక్ దాడి.. వీడియోలతో భారత్ కౌంటర్

ABN, Publish Date - May 10 , 2025 | 12:51 PM

Operation Sindoor: పాకిస్థాన్ అటాక్‌లో జమ్మూకశ్మీర్‌లోని శంభు ఆలయం పాక్షికంగా దెబ్బతిన్నది. అలాగే నివాసాలు, ఆలయంపై పాక్ నిరంతరం దాడులు చేస్తూనే ఉంది. ఇందుకు సంబంధించిన వీడియో, ఫోటోలను రక్షణ శాఖ సోషల్ మీడియాలో విడుదల చేసింది.

Operation Sindoor

న్యూఢిల్లీ, మే 10: భారత్ - పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఆపరేషన్ సిందూర్ పేరిట కేవలం ఉగ్రవాదులే లక్ష్యంగా భారత ఆర్మీ దాడులు చేసింది. అయితే పాకిస్థాన్ అందుకు విరుద్ధంగా భారత్‌ పౌరులను టార్గెట్‌ చేస్తూ దాడులకు పాల్పడుతూ రెచ్చగొడుతోంది. పౌరుల ఇళ్లతో పాటు దేవాలయాలపై కూడా పాక్ దాడి చేస్తోంది. పైగా తాము ప్రజలపై దాడి చేయడం లేదంటూ కహానీలు చెబుతోంది పాక్. భారత రక్షణ శాఖ విడుదల చేసిన ఈ వీడియోలే నివాసాలు, ఆలయాలపై దాడికి సాక్షాలుగా నిలిచాయి.


పాకిస్థాన్ అటాక్‌లో జమ్మూకశ్మీర్‌లోని శంభు ఆలయం పాక్షికంగా దెబ్బతిన్నది. అలాగే నివాసాలు, ఆలయంపై పాక్ నిరంతరం దాడులు చేస్తూనే ఉంది. ఇందుకు సంబంధించిన వీడియో, ఫోటోలను రక్షణ శాఖ సోషల్ మీడియాలో విడుదల చేసింది. వీటిని చూస్తే పాక్ వంకర బుద్ధి అర్థమవుతోంది. తాము పౌరులపై దాడి చేయడం లేదన్న పాక్ వ్యాఖ్యలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచాయి ఈ ఫోటోలు, వీడియోలు.


జమ్మూలోని ప్రసిద్ధి శంభు ఆలయం, నివాస ప్రాంతాలు, ప్రార్థనా స్థలాలను లక్ష్యంగా చేసుకుని పాక్ దాడులకు తెగబడిందని.. భారత్ ఆర్మీ వాటిని ఎదుర్కుందని రక్షణ శాఖ పేర్కొంది. రాత్రి సమయాల్లో డ్రోన్‌లతో ప్రజల నివాస స్థాలాలు, మతపరమైన ప్రదేశాలలో పాక్ దాడులు చేసిందని తెలిపింది. వారి ప్రయత్నాన్ని భారత ఆర్మీ ఎదుర్కుందని.. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు ఇండిన్ ఆర్మీ కట్టుబడి ఉందని సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా రక్షణ శాఖ స్పష్టం చేసింది. మరోవైపు పాకిస్తాన్ దాడుల్లో పాక్షికంగా దెబ్బతిన్న శంభు ఆలయాన్నీ సీఎం ఒమర్ అబ్దుల్లా పరిశీలించారు.


పాక్‌ చర్యలను తిప్పికొడుతున్న భారత్

పాక్ చర్యలను భారత ఆర్మీ ఎప్పటికప్పుడు తిప్పి కొడుతూనే ఉంది. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్‌లో ఉన్న ఉగ్రశిబిరాలపై ఇండియన్ ఆర్మీ దాడి చేసి ఉగ్రవాదులను మట్టుబెట్టినప్పటి నుంచి పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. సరిహద్దుల్లో పౌరులే లక్ష్యంగా కాల్పులకు తెగబడుతోంది పాక్ ఆర్మీ. వారికి భారత జవాన్లు ధీటుగా సమాధానం ఇస్తున్నారు. అంతేకాకుండా భారత్‌పై మిస్సైల్స్‌తో దాడి చేసేందుకు విఫలయత్నం చేయగా.. వాటిని పనికిరాకుండా చేశారు ఇండియన్ సోల్జర్స్‌. నిన్న (శుక్రవారం) అర్ధరాత్రి భారత్‌లో ఏకంగా 26 ప్రదేశాలపై డ్రోన్లతో పాక్ దాడికి తెగబడింది. అయితే పాక్ దాడిని భారత్ తిప్పికొట్టింది. అంతే కాకుండా పాకిస్తాన్‌లోని మూడు ప్రధాన వైమానిక స్థావరాలపై భారత్ దాడి చేసింది. దాడుల విషయాన్ని ఆ దేశ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరిఫ్ చౌదురి ధ్రువీకరించారు. పాక్ సైన్యం హెడ్‌క్వార్టర్స్‌ ఉన్న రావల్పిండి చక్లాలలోని నూరాన్, చక్వాల్లోని మురీద్, జాంగ్ జిల్లా షోర్కోట్లో ఉన్న రఫీకి వైమానిక స్థావరాల్లో పేలుళ్లు జరిగాయని వెల్లడించారు.


ఇవి కూడా చదవండి

Operation Sindoor: పాక్ సైన్యం సరిహద్దుల దిశగా కదులుతోంది.. కల్నల్ సోఫియా ఖురేషీ

Operation Sindoor: సోషల్ మీడియాలో పాకిస్తాన్ తప్పుడు ప్రచారం.. అందులో నిజం లేదు..

Read latest National News And Telugu News

Updated Date - May 10 , 2025 | 05:35 PM