Share News

Operation Sindoor: సోషల్ మీడియాలో పాకిస్తాన్ తప్పుడు ప్రచారం.. అందులో నిజం లేదు..

ABN , Publish Date - May 10 , 2025 | 10:48 AM

Operation Sindoor: గతకొంత కాలంనుంచి పాక్‌కు చెందిన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో భారత్‌ గౌరవాన్ని తగ్గించేలా.. ప్రజల్ని భయపెట్టేలా పోస్టులు పడుతూనే ఉన్నాయి. వాటిపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ చేసి ప్రజలకు నిజాలను అందిస్తోంది.

Operation Sindoor: సోషల్ మీడియాలో పాకిస్తాన్ తప్పుడు ప్రచారం.. అందులో నిజం లేదు..
Operation Sindoor

భారత సైనికులు కదన రంగంలో వీరోచితంగా పోరాడుతూ జాతి ఖ్యాతిని శిఖరాగ్రాలకు ఎక్కిస్తున్నారు. కానీ, పాకిస్తాన్‌లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. భారత ఆర్మీ కొడుతున్న దెబ్బలకు పాక్ సైన్యం అల్లాడిపోతోంది. దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయింది. గత రెండు రోజులనుంచి పాక్‌కు చుక్కలు కనిపిస్తున్నాయి. ఆ దేశంలోని ప్రముఖ ప్రాంతాలు భారత మిస్సైల్స్, డ్రోన్ల దాడుల్లో ధ్వంసం అవుతున్నాయి. యుద్ధ భూమిలో భారత్‌ను ఏమీ చేయలేకపోతున్న పాక్.. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తూ సంతోషిస్తోంది. పాక్ ప్రముఖులు ఫేక్ వీడియోలు, ఫొటోలు షేర్ చేస్తూ శునకానందం పొందుతున్నారు.


పాకిస్తాన్‌కు చెందిన ఎమ్.మద్నీ అనే వ్యక్తి తాజాగా, సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్టు పెట్టాడు. ‘ జెట్‌లోంచి దూకిన ఇండియాకు చెందిన మహిళా ఏయిర్ ఫోర్స్ పైలట్ స్క్వాడ్ రన్ లీడర్ శివానీ సింగ్‌ను పాకిస్తాన్ పట్టుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె వీడియో కూడా ఉంది చూడండి. సరే నేను టీ తాగాలి. అభినందన్ తర్వాత ఇప్పుడు మరొకరు పట్టుబడ్డారు’ అని రాసుకొచ్చాడు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ పోస్టుపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ చేసింది. నిజానిజాలు వెలుగులోకి తీసుకువచ్చింది.


ఎమ్.మద్నీ పెట్టిన వీడియో ఫేక్ అని తేల్చింది. కేవలం ఈ ఒక్క వీడియోనే కాదు.. గతకొంత కాలంనుంచి పాక్‌కు చెందిన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో భారత్‌ గౌరవాన్ని తగ్గించేలా.. ప్రజల్ని భయపెట్టేలా పోస్టులు పడుతూనే ఉన్నాయి. వాటిపై పీఐబీ ఫ్యాక్ట్ చేసి ప్రజలకు నిజాలను అందిస్తోంది. రెండు రోజుల క్రితం మహ్మద్ అలీ రెజా రజు అనే వ్యక్తి తన ట్విటర్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేశాడు. జమ్మూకాశ్మీర్ ఏయిర్ బేస్‌లో బాంబులు పడ్డాయని రాసుకొచ్చాడు. దానిపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ చేసింది. ఆ వీడియో 2021, కాబూల్ ఏయిర్‌పోర్టుకు సంబంధించినదని తేల్చింది.


ఇవి కూడా చదవండి

Operation Sindoor: భారత్,పాక్ యుద్ధం.. పాక్‌లో చిక్కుకుపోయిన అమెరికన్ యూట్యూబర్

Operation Sindoor: ఇండియాతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు.. తుస్సుమంటున్న పాక్ మిస్సైల్స్..

Updated Date - May 10 , 2025 | 11:44 AM