Operation Sindoor: ఇండియాతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు.. తుస్సుమంటున్న పాక్ మిస్సైల్స్..
ABN , Publish Date - May 10 , 2025 | 08:59 AM
Operation Sindoor: Fatah II మిసైల్ అధునాతనమైన టెక్నాలజీతో తయారు చేసింది. ఇది 400 కిలోమీటర్ల రేంజ్‌తో టార్గెట్ చేయగలదు. అది కూడా పిన్ పాయింట్ కచ్చితత్వంతో శత్రు రాజ్యాలను ధ్వంసం చేయగలదు.
ఇండియాను దెబ్బ తీయాలని అనుకుంటున్న ప్రతీ సారి పాకిస్తాన్‌కు ఎదురు దెబ్బ తగులుతోంది. ఇండియాపై పాక్ ప్రయోగిస్తున్న మిస్సైల్స్, డ్రోన్లు తుస్సుమంటున్నాయి. భారత సైన్యం వాటిని గాల్లోనే పేల్చిపడేస్తోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాతినుంచి ఇప్పటి వరకు పదుల సంఖ్యలో మిసైల్స్, డ్రోన్లను ఆర్మీ ధ్వంసం చేసింది. తాజాగా, పాకిస్తాన్‌కు చెందిన పవర్‌ఫుల్ మిస్సైల్ ఫతాహ్ 2ను భారత ఆర్మీ కూల్చేసింది. శనివారం ఉదయం హర్యానాలోని సిర్సాలో ఫతాహ్ తుస్సుమంది. పాపం పాకిస్తాన్ పరిస్థితి విలన్‌కు తక్కువ.. కమెడియన్‌కు ఎక్కువగా తయారైంది.
Fatah II మిసైల్ ప్రత్యేకతలు ఏంటి..
Fatah II మిసైల్ అధునాతనమైన టెక్నాలజీతో తయారు చేసింది. ఇది 400 కిలోమీటర్ల రేంజ్‌తో టార్గెట్ చేయగలదు. అది కూడా పిన్ పాయింట్ కచ్చితత్వంతో శత్రు రాజ్యాలను ధ్వంసం చేయగలదు. ఈ మిస్సైల్‌లో ఏకంగా 350 కేజీల మందుగుండు సామాగ్రిని నింపొచ్చు. ఇక, ఇండియన్ ఎయిర్ బేస్‌లను టార్గెట్ చేస్తూ పాకిస్తాన్ మిస్సైల్స్‌ను వదులుతోంది. అయితే, పాకిస్తాన్‌ను మించి భారత్ దగ్గర అత్యాధునిక టెక్నాలజీ ఉంది. ఆ టెక్నాలజీతో శత్రువుల మిస్సైల్స్, డ్రోన్లను గుర్తించి.. వాటిని గాల్లోనే ధ్వంసం చేస్తోంది.
పాకిస్తాన్‌కు చుక్కలు
పాకిస్తాన్ ఏయిర్ బేస్‌ల మీద ఇండియా వరుస దాడులు చేస్తోంది. శనివారం పాకిస్తాన్‌లోని నాలుగు ఏయిర్ బేస్‌లను టార్గెట్ చేసి ఇండియా దాడులు చేసినట్లు సమాచారం. ఇస్లామాబాద్, రావాల్పిండి, సియాల్‌కోట్, లాహోర్, పెషావర్‌లపై భారత ఆర్మీ డోన్ల వర్షం కురిపిస్తోంది. పాకిస్తాన్ దేశానికి అత్యంత కీలకమైన ఎయిర్‌బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్‌ను సైతం భారత్ కూల్చివేసింది. రాత్రి వేళ దాడి చేయడానికి పాక్ దీన్ని యాక్టివేట్ చేసింది. అది గుర్తించిన భారత్.. పంజాబ్ ప్రావిన్స్‌లో దాన్ని కూల్చేసింది.
ఇవి కూడా చదవండి
Pahalgam Terror Attack: పాకిస్తాన్‌కు మరో దెబ్బ..జీ7 దేశాల కీలక ప్రకటన..
Operation Sindoor: పంజాబ్‌లో పాకిస్తాన్ డ్రోన్ దాడి.. ముగ్గురికి గాయాలు..