Watermelon: పుచ్చకాయల్లో ఎలాంటి రసాయనాలు కలపడం లేదు
ABN, Publish Date - Apr 17 , 2025 | 12:20 PM
వేసవి తాపం నుంచి ఉపశమనం కల్పించే పుచ్చకాయల్లో ఎలాంటి రసాయనాలు కలపడం లేదని మద్రాసు హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. అలాగే పుచ్చకాయల్లో రసాయనాలు కలుస్తున్నాయని వస్తున్న వార్తలను కూడా ఎవరూ నమ్మవద్దంటూ వ్యాపారులు, రైతలులు తెలుపుతున్నారు.
- హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం
చెన్నై: పుచ్చకాయల్లో ఎలాంటి రసాయనాలు కలపడం లేదని మద్రాసు హైకోర్టు(Madras High Court)కు రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. రాష్ట్రంలో ఎండలు అధికమవుతున్న కారణంగా ప్రజలు పుచ్చకాయలు, పండ్ల రసాలు సేవిస్తున్నారు. ప్రజలను ఆకర్షించేలా ఎరుపు రంగుతో కూడిన పుచ్చకాయలు విక్రయించేలా వ్యాపారులు వాటిలో రసాయనాలు కలుపుతున్నారంటూ ఆహార భద్రతా శాఖ అధికారులు ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. అధికారుల దాడుల కారణంగా పుచ్చకాయల విక్రయాలు గణనీయంగా తగ్గిపోవడంతో రైతులు నష్టాలు చవిచూశారు.
ఈ వార్తను కూడా చదవండి: Instagram: ఇన్‌స్టాగ్రామ్ అంతపని చేసిందన్నమాట.. చివరకు ఏమైందంటే..
ఈ నేపథ్యంలో చెంగల్పట్టు(Chengalpattu) రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు వెంకటేశన్ మద్రాసు హైకోర్టులో దాఖలుచేసిన పిటిషన్‌లో... పుచ్చకాయలు ఎరుపుగా, రుచితో ఉండేలా రసాయనాలు కలుపుతున్నట్లు మాట్లాడి, ప్రజల మధ్య ఆందోళన రేకిత్తించేలా వ్యవహరించిన ఆహార భద్రత శాఖ అధికారులపై చర్యలు చేపట్టాలన్నారు. అలాగే, పుచ్చకాయలు ప్రభుత్వమే కొనుగులో చేసి తగిన గిట్టుబాటు ధర అందించేలా చర్యలు చేపట్టాలని పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్ న్యాయమూర్తి భరత్ చక్రవర్తితో కూడిన ధర్మాసనం విచారించగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పుచ్చకాయలు పరిశీలించామని, వాటిలో ఎలాంటి రసాయనాలు వాడడం లేదని నిర్ధారణ అయిందని ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపారు.
ఆ ప్రకారం, పుచ్చకాయలపై ప్రజల్లో ఏర్పడి భయాందోళనలు నివారించేలా ప్రచారం చేపట్టనున్నట్లు తెలిపింది. అనంతరం న్యాయమూర్తి... పిటిషనర్ ఆరోపణలపై బదులు పిటిషన్ దాఖలుచేయాలని ఆహార భద్రతా శాఖ అధికారి సతీష్‌కుమార్‌కు ఆదేశిస్తూ, తదుపరి విచారణ జూన్ 9వ తేదీకి వాయిదావేశారు. అలాగే, పుచ్చకాయల రైతులకు ఏర్పడిన భర్తీచేసేలా, పుచ్చకాయల్లో ఎలాంటి రసాయనాలు కలపడం లేదని ప్రజలకు అవగాహన కల్పించేలా పత్రికల్లో ప్రకటనలు జారీచేయాలని న్యాయమూర్తి ఉత్తర్వుల్లో ప్రభుత్వాన్ని ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి
ప్రైవేట్ ఆస్పత్రి పొమ్మంటే.. సర్కారు దవాఖానా ప్రాణాలు నిలిపింది
తెలంగాణ పోలీసులకు సీఎం అభినందనలు
Read Latest Telangana News and National News
Updated Date - Apr 17 , 2025 | 12:20 PM