ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Pakistan Disinformation Campaign: పాక్ సిగ్గులేని పని.. మరీ ఇంతగా దిగజారాలా..

ABN, Publish Date - May 10 , 2025 | 12:10 PM

India Pakistan Army: భారత్‌తో యుద్ధం చేతగాని పాకిస్థాన్ సిగ్గులేని పనులతో తన బండారం బయటపెట్టుకుంటోంది. మనపై విద్వేషాన్ని చిమ్మేందుకు ప్రయత్నిస్తోంది. సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ఫేక్‌న్యూస్‌తో దుష్ప్రచారం చేస్తోంది.

Pakistan Disinformation Campaign

యుద్ధం కావాలంటూ భారత్‌ను రెచ్చగొట్టిన పాకిస్థాన్ ఇప్పుడు పిరికిపంద చేష్టలతో పరువు తీసుకుంటోంది. ఒకవైపు తమ దాడుల్ని సమర్థంగా తిప్పికొట్టడమే గాక మరోవైపు రావల్పిండితో పాటు పలు ప్రముఖ నగరాల్లో ఎయిర్‌బేస్‌లను ఇండియా పేల్చేస్తుండటం, మిలటరీ పోస్ట్‌లను ధ్వంసం చేస్తుండటంతో పాక్‌కు నిద్రపట్టడం లేదు. భారత ఆర్మీ పేరు చెబితేనే ప్రత్యర్థి దేశం వణుకుతోంది. మన జోరును ఎలా ఆపాలో తెలియక చివరికి సోషల్ మీడియాను నమ్ముకుంది. అందుకే ఫేక్ న్యూస్‌ను వైరల్ చేస్తూ భారత్‌పై విద్వేషాన్ని రెచ్చగొడుతోంది. ఇందులో భాగంగానే ఓ పాపులర్ గురుద్వారాపై ఫేక్ న్యూస్ మొదలుపెట్టింది పాకిస్థాన్. దీని గురించి ఇప్పుడు చూద్దాం..


పోరాటం ఆగదు..

నంకానా సాహిబ్ గురుద్వారా.. పాకిస్థాన్‌లోని ఈ ప్రసిద్ధ సిక్కు మందిరానికి విశిష్టమైన చరిత్ర ఉంది. సిక్కు మత స్థాపకుడు గురు నానక్ పుట్టింది ఇక్కడే. సిక్కులు ఎంతో పవిత్రంగా భావించే ఈ మందిరంపై పాకిస్థాన్ ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తోంది. నంకానా సాహిబ్ గురుద్వారాను భారత భద్రతా బలగాలు పేల్చేశాయంటూ అబద్ధపు వార్తల్ని నెట్టింట వైరల్ చేస్తోంది. ఈ గురుద్వారాపై డ్రోన్లతో భారత్ దాడికి దిగిందంటూ విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. అయితే ఇది ఫేక్ న్యూస్ అని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ తేల్చింది. సంప్రదాయ విద్వేషాలు రెచ్చగొట్టేందుకు పాక్ ఇలాంటి వీడియోలు తయారు చేస్తోందంటూ ఫ్యాక్ట్ చెక్ సీరియస్ అయింది. ఇలాంటి వీడియోలను ఫార్వర్డ్ చేయొద్దని ప్రజల్ని కోరింది. పాక్ ప్రాపగండాకు వ్యతిరేకంగా భారత్ పోరాడుతుందని స్పష్టం చేసింది. ఇది చూసిన నెటిజన్స్.. యుద్ధం చేతగాకపోతే ఓటమి ఒప్పుకోవాలని, అంతేగానీ ఇలాంటి ఫేక్ న్యూస్‌లు ప్రచారం చేయడం ఏంటని ఫైర్ అవుతున్నారు. మరీ ఇంతగా దిగజారాలా అని క్వశ్చన్ చేస్తున్నారు.


ఇవీ చదవండి:

పాక్ విష ప్రచారం.. చైనా వైరల్..

నా పుట్టినరోజు వేడుకలకు ఎవరూ రావొద్దు

పాకిస్తాన్‌లో పెట్రోల్ బంకులు క్లోజ్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 10 , 2025 | 01:37 PM