ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Video Viral: కన్నడంలో మాట్లాడనంటూ బ్యాంకు మేనేజర్ వీరంగం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే

ABN, Publish Date - May 21 , 2025 | 07:56 PM

కర్ణాటకలోని అనేకల్‌ తాలూకా సూర్యానగర్ బ్రాంచ్‌లో చోటుచేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో అధికారులు చర్యలకు దిగారు. కాగా, బ్యాంకు మేనేజర్ చర్యను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్రంగా ఖండించారు.

బెంగళూరు: కన్నడంలో మాట్లేందుకు నిరాకరించి, అందుకు బదులుగా హిందీ మాట్లాడాలని పట్టుబడుతూ కస్టమర్‌తో వాదనకు దిగిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మేనేజరుపై ఆ బ్యాంకు ఉన్నతాధికారుల చర్యలు తీసుకున్నారు. ఆమెను మరో బ్రాంచ్‌కు బదిలీ చేశారు. కర్ణాటకలోని అనేకల్‌ తాలూకా సూర్యానగర్ బ్రాంచ్‌లో చోటుచేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో అధికారులు ఈ చర్యకు దిగారు. కాగా, బ్యాంకు మేనేజర్ వ్యాఖ్యలను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్రంగా ఖండించారు.

తొలి 9000 హెచ్‌పీ లోకోమోటివ్ ఇంజన్.. జాతికి అంకితం చేయనున్న మోదీ


ఘటన వివరాల ప్రకారం, సూర్యానగర్ బ్యాంచ్ మహిళా మేనేజర్ మంగళవారంనాడు ఓ కస్టమర్‌తో వాదనకు దిగారు. "నేను కన్నడంలో మాట్లాడేదే లేదు. హిందీలోనే మాట్లాడతా" అని ఆమె అనడంతో కస్టమర్ ఆర్బీఐ రూల్స్ గుర్తుచేశారు. కస్టమర్లతో మాట్లాడేటప్పుడు ప్రాంతీయ భాషలను ప్రోత్సహించాలని ఆర్బీఐ స్పష్టమైన ఆదేశాలున్నాయంటూ ఆయన చెప్పారు. అయితే మేనేజర్ మాత్రం కన్నడంలో మాట్లాడేదే లేదని తెగేసి చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో కన్నడ యాక్టివిస్ట్‌లు, కన్నడ అనుకూల సంస్థలు విరుచుకుపడ్డాయి. బ్యాంకు మేనేజర్ క్షమాపణ చెప్పాలని, ఆమెపై క్షమశిక్షణాచర్యలు తీసుకోవాలని డిమాండ్‌లు వెల్లువెత్తాయి.


మేనేజర్ ప్రవర్తనను తప్పుపట్టిన సీఎం

దీనిపై సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. ''కన్నడం, ఇంగ్లీషులో మాట్లాడేందుకు నిరాకరిస్తూ పౌరుల పట్ల ఎస్‌బీఐ బ్రాంచ్ మేనేజర్ వ్యవహరించిన తీరు గర్హనీయం. ఆ ఆధికారిని వెంటనే బదిలీ చేస్తూ ఎస్‌బీఐ చర్య తీసుకోవడాన్ని అభినందిస్తున్నాను. ఈ వ్యవహారం ఇంతటితో ముగిసినట్టుగానే భావిస్తున్నాను. అయితే ఇలాంటి సంఘటనలు పునరావృతం కారాదని కోరుతున్నాను. బ్యాంకు ఉద్యోగులంతా తప్పనిసరిగా కస్టమర్ల పట్ల గౌరవంగా వ్యవహరించాలి. సాధ్యమైనంత వరకూ స్థానిక భాషలో మాట్లాడేందుకు ప్రయత్నించాలి. దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకు సిబ్బందికి సంస్కృతి, భాషాపరమైన సెన్సిటైజేషన్‌పై శిక్షణ తప్పనిసరి చేయాలని భారత ఆర్థిక శాఖ మంత్రికి, ఫైనాన్షియల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్‌కు విజ్ఞప్తి చేస్తున్నాను" అని అన్నారు. 'కన్నడ ఫస్ట్' హ్యాష్ ట్యాగ్‌తో తన ట్వీట్ ముగించారు.


స్థానిక భాషా విధానం అమలు చేయాలి: తేజస్వి సూర్య

కాగా, ఈ ఘటనపై బెంగళూరు సౌత్ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య స్పందించారు. మేనేజర్ ప్రవర్తన ఆమోదయోగ్యం కాదన్నారు. కర్ణాటకలోని బ్యాంకుల్లో కస్టమర్లకు కన్నడంలో సేవలు అందించాలని అన్నారు. ఈ అంశాన్ని కొన్ని వారాల క్రితం పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశంలో ఆర్థిక సేవల విభాగం దృష్టికి తెచ్చానని, భాషాపరమైన అవసరాలను దృష్టిలో ఉంచుకుని తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని డీఎఫ్ఎస్ సెక్రటరీ తనకు హామీ ఇచ్చారని చెప్పారు. అయితే అది సరిగా అమలు కావడం లేదని అనిపిస్తోందని, ఎస్‌బీఐ అధికారులు తక్షణమే డీఎఫ్ఎస్ పాలసీని అమలు చేయాలని కోరారు. మేనేజర్ ప్రవర్తనపై తగిన చర్యలు తీసుకోవాలని కూడా సంబంధిత అధికారులతో మాట్లాడినట్టు చెప్పారు.


Puja Khedkar: ఆమె డ్రగ్ లార్డా? టెర్రరిస్టా?.. పూజా ఖేడ్కర్‌కు సుప్రీంకోర్టు ముందస్తు బెయిలు

Sonia andhi-Rahul Gandhi: చిక్కుల్లో సోనియా-రాహుల్.. ఈడీ సంచలన ఆరోపణలు..

Police Encounter: ఎన్‌కౌంటర్‌లో గ్యాంగస్టర్‌ సభ్యుడికి గాయాలు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 21 , 2025 | 07:57 PM