తొలి 9000 హెచ్‌పీ లోకోమోటివ్ ఇంజన్.. జాతికి అంకితం చేయనున్న మోదీ
ABN , Publish Date - May 21 , 2025 | 05:23 PM
కచ్ జిల్లా భుజ్‌లోని మీర్జాపూర్ రోడ్డులో ఏర్పాటు చేసే బహిరంగ సభలో మోదీ ప్రసంగించిన అనంతరం ప్రఖ్యాత మాతా ఆశాపుర టెంపుల్‌ను దర్శిస్తారు. దహోద్‌లోని రైల్వే ప్రొడక్షన్ యూనిట్‌లో తొలి 9000 హెచ్‌పీ లోకోమోటివ్ ఇంజన్‌ను ప్రారంభిస్తారు.
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) అనంతరం తొలిసారి తన స్వరాష్ట్రమైన గుజరాత్‌లో పర్యటించనున్నారు. మే 26,27 తేదీల్లో దహోద్, కచ్, గాంధీనగర్ జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
CPEC: ఆప్ఘన్ వరకూ చైనా-పాక్ ఎకనామిక్ కారిడార్ విస్తరణ.. భారత్ అభ్యంతరం
కచ్ జిల్లా భుజ్‌లోని మీర్జాపూర్ రోడ్డులో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం ఆయన ప్రఖ్యాత మాతా ఆశాపుర టెంపుల్‌ను దర్శిస్తారు. దహోద్‌లోని రైల్వే ప్రొడక్షన్ యూనిట్‌లో తొలి 9000 హెచ్‌పీ లోకోమోటివ్ ఇంజన్‌ను ప్రారంభిస్తారు. రూ.20,000 కోట్లతో ఈ ప్రొడక్షన్ యూనిట్‌ను నిర్మించారు.
రాబోయే పదేళ్లలో 1,200 ఇంజన్ల తయారీ
పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్ భాగస్వామ్యం కింద ఏర్పాటు చేసిన ఈ రైల్వే ప్రాజెక్ట్ రాబోయే పదేళ్లలో 1,200 ఇంజన్లు తయారు చేయనుంది. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా వీటిని ఎగుమతి చేస్తారు. త్వరలోనే 100 శాతం 'మేక్ ఇన్ ఇండియా' ఇనిషియేటివ్‌గా ఈ లోకోమోటివ్ ఇంజన్లు తయారు కానున్నాయి.
ప్రత్యేకతలు
ఈ ఇంజన్‌లలో కీలక ఫీచర్లలో ప్రధానమైనది సరకు రవాణా సామర్థ్యం. 4,600 టన్నుల బరువైన కార్గోను ఈ ఇంజన్ తీసుకువెళ్తుంది. తొలిసారి ఈ ఇంజన్లకు ఏసీ, డ్రైవర్‌కు టాయిలెట్ సౌకర్యం వంటివి కూడా ఉంటాయి. భద్రత, ప్రమాదాల నివారణకు అడ్వాన్స్‌డ్ కవర్ సిస్టంను ఏర్పాటు చేస్తున్నారు. రూ.20,000 కోట్లతో నిర్మితమైన దహోద్ ఫ్యాక్టరీలో ప్రస్తుతం నాలుగు ఇంజన్లను ఉత్పత్తి చేశారు. ఇవి 'మాన్యుఫ్యాక్టర్డ్ ఇన్ దహోద్' అనే లేబిల్ కూడా కలిగి ఉంటాయి.
ఈ ప్రాజెక్టుతో దహోద్‌లోని సుమారు 10,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కలుగుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో గణనీయంగా ఈ ప్రాంతం ఆర్థికంగా బలపడుతుంది. కాగా, 9000 హెచ్‌పీ, 6 యాక్సిల్ ఎలక్ట్రిక్ ఇంజన్ యావరేజ్ స్పీడ్ గంటకు 75 కిలోమీటర్లు ఉంటుంది. ఈ ఇంజన్ల మెయింటెనెన్స్ ఖరగ్‌పూర్ (పశ్చిమబెంగాల్), విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్) రాయపూర్ (ఛత్తీస్‌గఢ్), పుణె (మహారాష్ట్ర)లోని డిపోల్లో నిర్వహిస్తారు.
Puja Khedkar: ఆమె డ్రగ్ లార్డా? టెర్రరిస్టా?.. పూజా ఖేడ్కర్‌కు సుప్రీంకోర్టు ముందస్తు బెయిలు
Sonia andhi-Rahul Gandhi: చిక్కుల్లో సోనియా-రాహుల్.. ఈడీ సంచలన ఆరోపణలు..
Police Encounter: ఎన్‌కౌంటర్‌లో గ్యాంగస్టర్ సభ్యుడికి గాయాలు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి