Jammu and Kashmir: పర్యాటక ప్రాంతాల్లో మళ్లీ తెరుచుకున్న పార్కులు..
ABN, Publish Date - Jun 17 , 2025 | 03:39 PM
పహల్గాం ఉగ్రదాడి అనంతరం జమ్మూ కశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లోని పార్కులు మళ్లీ తెరుచుకున్నాయి.
శ్రీనగర్, జూన్ 17: పెహల్గాం ఉగ్రదాడి అనంతరం జమ్మూ కాశ్మీర్‌లో పర్యాటక ప్రాంతాల్లోని పార్కులను తిరిగి తెరిచారు. ఈ ప్రాంతంలో మొత్తం 16 పార్కులను తెరిచారు. ఆ జాబితాలో పహల్గాంలోని పార్కు సైతం ఉందని ఉన్నతాధికారులు మంగళవారం వెల్లడించారు. పర్యాటకులు, స్థానిక కోసం ఈ పార్కులను తిరిగి తెరిచినట్లు వారు తెలిపారు. అయితే ఈ పార్కుల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు వివరించారు.
జమ్మూ కాశ్మీర్‌లోని మొత్తం 16 పార్కులు తిరిగి తెరవాలంటూ ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా శనివారం ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆ యా పార్కులను తిరిగి తెరిచారు. జమ్మూ ప్రాంతంతోపాటు కాశ్మీర్ వ్యాలీలోని ఏనిమిది పార్కులు తెరిచారు. మిగిలిన వాటిని దశల వారీగా తెరుస్తామని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తెలిపారు. ఆ జాబితాలో వివిధ జిల్లాలో ప్రముఖ పార్కులు సైతం ఉన్నాయి. రాష్ట్రంలో పలు పార్కులు తిరిగి తెరవడం పట్ల పర్యాటకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే పలువురు రాజకీయ నేతలు సైతం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.
ఏప్రిల్ 22వ తేదీ జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలోని పహల్గాం మైదానంలో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మొత్తం 26 మంది మరణించారు. ఈ ఘటనకు తామే బాధ్యులమంటూ లష్కరే తోయిబా సంస్థకు చెందిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించింది. ఆ కాల్పుల ఘటన వెనుక పాకిస్థాన్ హస్తం ఉందని భారత్ భావించింది. ఆ క్రమంలో ఆ దేశానికి వ్యతిరేకంగా భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
అలాగే పాకిస్థాన్ సైతం భారత్‌కు వ్యతిరేకంగా పలు నిర్ణయాలు తీసుకుంది. దీంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అలాంటి వేళ.. భారత్ ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని దాదాపు 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో దాదాపు 100 మంది ఉగ్రవాదులు మరణించారు. ఈ చర్యలకు ప్రతి చర్యగా పాకిస్థాన్.. దేశ సరిహద్దుల్లోని భారత్ భూభాగంలోని పలు ప్రాంతాలపైకి డ్రోనులు, క్షిపణులతో దాడులు చేసింది. ఈ దాడులను భారత్ తిప్పికొట్టింది.
ఇక పహల్గాం ఉగ్రదాడి అనంతరం జమ్మూ కాశ్మీర్‌లోని పార్కులను మూసి వేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లోని పార్కులన్నీ తిరిగి తెరవాలంటూ జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆదేశాలు జారీ చేశారు. దీంతో పార్కులు మళ్లీ తెరుచుకున్నాయి. మరోవైపు జమ్మూ కాశ్మీర్‌లో పర్యాటకులు పోటెత్తుతోన్నారు.
ఇవి కూడా చదవండి:
వెయ్యి మంది ఫోన్లు ట్యాపింగ్.. వెలుగులోకి సంచలన విషయాలు..
విమానానికి మళ్లీ బాంబు బెదిరింపు.. అత్యవసరంగా ల్యాండింగ్
Read Latest AP News And Telugu News
Updated Date - Jun 17 , 2025 | 03:50 PM