Share News

Phone Tapping: వెయ్యి మంది ఫోన్లు ట్యాపింగ్.. వెలుగులోకి సంచలన విషయాలు..

ABN , Publish Date - Jun 17 , 2025 | 02:37 PM

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Phone Tapping: వెయ్యి మంది ఫోన్లు ట్యాపింగ్.. వెలుగులోకి సంచలన విషయాలు..
Phone Tapping in Telangana

హైదరాబాద్, జూన్ 17: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ ఫోన్‌ ట్యాపింగ్‌‌కు సంబంధించిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం వెయ్యి మంది నేతల ఫోన్టు ట్యాప్ చేసినట్లు ఈ విచారణలో గుర్తించారు. తెలంగాణలో 650 మంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతల ఫోన్లను ట్యాప్ చేసినట్లు కనుగోన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నేతలపై ప్రధానంగా ఫోకస్ చేసి.. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అక్రమంలో పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఫోన్లను సైతం ట్యాప్ చేసినట్లు సిట్ విచారణలో వెలుగులోకి వచ్చింది. ఆమె ఎవరెవరితో మాట్లాడుతున్నారు. అందుకు సంబంధించిన ప్రతి అంశం నాటి ఏపీ సీఎం, ఆమె సోదరుడు వైఎస్‌ జగన్‌కు చేరవేసినట్లు సమాచారం.


మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో బాధితుల నుంచి సిట్ అధికారులు స్టేట్‌మెంట్ రికార్డు చేస్తున్నారు. అందులోభాగంగా టీపీపీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఈ రోజు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ విచారణ అధికారుల ముందు హాజరయ్యారు. ఈ ట్యాపింగ్ వల్ల తాము ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నామో సిట్ అధికారులకు ఆయన వివరించారు.


ముచ్చటగా మూడోసారి అధికారాన్ని అందుకోవాలని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నించింది. ఆ క్రమంలో రాష్ట్రంలోని విపక్ష నేతలతోపాటు స్వపక్షంలోనే వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న నేతలు.. అలాగే పక్క రాష్ట్రంలో పలువురి నేతల దృష్టి సారించింది. అందులోభాగంగా వారి ఫోన్లను ట్యాప్ చేసింది. అయితే 2018 ఏడాది చివర్లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ఓటరు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాడు. దీంతో రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది. బీఆర్ఎస్ ప్రతిపక్షానికి పరిమితమైంది. అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనూహ్యంగా తెర మీదకు వచ్చింది. దీంతో ఈ వ్యవహారాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిట్‌కు అప్పగించింది.


మరోవైపు ఈ వ్యవహారం వెలుగులోకి రాగానే ఈ ఫోన్ ట్యాపింగ్‌లో కీలకంగా వ్యవహరించిన మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు యూఎస్ వెళ్లిపోయారు. దీంతో ఆ అంశంలో మిగిలిన అధికారుల ప్రమేయాన్ని సిట్ అధికారులు అరెస్ట్ చేసి విచారించారు. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే తాము ఈ విధంగా వ్యవహరించామని సిట్ అధికారుల ఎదుట వారు స్పష్టం చేశారు.


దీంతో యూఎస్‌లోని ప్రభాకర్ రావును భారత్‌కు రప్పించే ప్రయత్నం చేశారు. దాంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలతో ఆయన హైదరాబాద్ తిరిగి వచ్చి.. సిట్ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. ఈ సిట్ అధికారుల విచారణలో తొలుత ఆయన ప్రశ్నలను దాట వేసినట్లు సమాచారం. అనంతరం వరుసగా జరిగిన విచారణలో ఆయన నుంచి సిట్ అధికారులు కీలక విషయాలను రాబట్టినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి:

విమానానికి మళ్లీ బాంబు బెదిరింపు.. అత్యవసరంగా ల్యాండింగ్

ఇంటికి చేరిన మృతదేహం.. పైలట్ సుమీత్ సబర్వాల్‌‌కు ఘన నివాళులు

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 17 , 2025 | 02:47 PM