Share News

Air India Plane Crash: ఇంటికి చేరిన మృతదేహం.. పైలట్ సుమీత్ సబర్వాల్‌‌కు ఘన నివాళులు

ABN , Publish Date - Jun 17 , 2025 | 12:01 PM

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంలో మరణించిన పైలట్ సమీత్ సబర్వాల్ మృతదేహం ముంబైలోని ఆయన నివాసానికి చేరుకుని. ఆయన మృతదేహానికి కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు ఘనంగా నివాళులర్పించారు.

Air India Plane Crash: ఇంటికి చేరిన మృతదేహం.. పైలట్ సుమీత్ సబర్వాల్‌‌కు ఘన నివాళులు
Captain Sumeet Sabharwal father

ముంబై, జూన్ 17: ఏ తండ్రి అయినా.. కన్న కొడుకు చేతుల మీదగా వెళ్లాలనుకొంటారు. అంటే తన అంత్యక్రియలు కన్న కొడుకే చేయాలని ప్రతి తండ్రి భావిస్తారు. అలాగే జరగాలని దాదాపుగా ప్రతి తండ్రి ఆ భగవంతుడిని కోరుకుంటారు. కానీ కన్న కొడుకు అంత్యక్రియలు.. తండ్రే నిర్వహించడం బాధాకరం. అది కూడా వృద్ధాప్యంలో ఆ తండ్రికి అటువంటి పరిస్థితి ఎదురైతే.. అది మరింత దరుణంగా ఉంటుంది. ప్రస్తుతం ఆ పరిస్థితి.. కెప్టెన్ సుమీత్ సబర్వాల్ తండ్రికి ఎదురైంది. అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలి దగ్ధమైన ఘటనలో ఆ విమానం కెప్టెన్‌ సుమీత్ సబర్వాల్ సైతం మరణించారు. సుమీత్ సబర్వాల్ మృతదేహాన్ని ముంబై.. పవాయిలోని జల్ వాయు విహార్‌లోని ఆయన నివాసానికి తీసుకు వచ్చారు.


ఈ సందర్భంగా సుమీత్ మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం ఆయన మృతదేహానికి వారు ఘన నివాళులర్పించారు. అయితే కుమారుడి మృతదేహం చూసి సుమీత్ సబర్వాల్ తండ్రి కన్నీరుమున్నీరయ్యారు. త్వరలో తన ఉద్యోగానికి రాజీనామా చేసి.. నీ బాగోగులు చూసుకుంటానని చెప్పిన కుమారుడు ఇలా విగత జీవిగా రావడాన్ని ఆ తండ్రి తట్టుకో లేక పోయారు. అలాగే సుమీత్‌తో తమకు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు.

Captain-Sumeet-Sabharwal-fa.jpg


జూన్ 12వ తేదీన అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ నుంచి లండన్ బయిలుదేరిన ఎయిర్ ఇండియా విమానం కొన్ని నిమిషాలకే బీజే కాలేజీ హాస్టల్‌పై కుప్పు కూలి దగ్ధమైంది. ఈ ప్రమాదంలో 270 మంది మరణించారు. వీరిలో ప్రయాణికులు, విమాన సిబ్బందితోపాటు బీజే కాలేజీ హాస్టల్‌లోని మెడికోలు సైతం మరణించారు. ఈ ప్రమాదంలో ఒకే ఒక్క ప్రయాణికుడు రమేశ్ బిశ్వాస్ ప్రాణాలతో బతికి బయటపడ్డారు.


అయితే ఈ ప్రమాదం జరిగిన విమానానికి సుమీత్ సబర్వాల్ పైలట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే సుమీత్ మేడే కాల్.. అంటూ ఎయిర్ పోర్ట్ అధికారులకు సందేశం పెంపారు. ఆ కొన్ని సెకన్లకే ఈ విమానం కుప్పకూలిపోయింది.


ఇక సుమీత్ సబర్వాల్ తండ్రి వృద్ధాప్యంలో ఉన్నారు. ఇటీవల సుమీత్ తన తండ్రిని కలిశారు. తన ఈ ఉద్యోగానికి రాజీనామా చేసి.. మీ సేవ చేసుకుంటానంటూ తన తండ్రికి సుమీత్ హామీ ఇచ్చారు. ఆ కొద్ది రోజులకే సుమీత్ ఇలా విగత జీవిగా మారడం పట్ల ఆ కన్నతండ్రి తట్టుకోలేక పోతున్నారు. విమానం నడపడంలో... 8200 గంటల సుదీర్ఘ అనుభవం సుమీత్ సబర్వాల్ సొంతమని ఇప్పటి ఎయిర్ ఇండియా అధికారులు ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే. సుమీత్ విధి నిర్వహణకు వెళ్తున్నప్పుడు.. తన తండ్రిని చూస్తూ ఉండాలని తమను కోరే వారని అతడి పొరుగింటి ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి:

కెనడా చేరుకున్న ప్రధాని మోదీ

భారీ వర్షాలు.. 18 మంది మృతి

For National News And Telugu News

Updated Date - Jun 17 , 2025 | 12:22 PM