ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Operation Sindoor: పాక్ దాడులపై ఎక్స్‌లో భారత ఆర్మీ పోస్ట్

ABN, Publish Date - May 09 , 2025 | 09:16 AM

ఓ పక్క డ్రోన్ దాడులు.. మరోపక్క చొరబాటు ప్రయత్నాలు.. సరిహద్దుల్లో పాక్ సైన్యం దుశ్చర్యలను భారత సైన్యం నిలువరిస్తోంది. సాంబా జిల్లా సరిహద్దు దగ్గర అతిపెద్ద చొరబాటును బీఎస్ఎఫ్ సైన్యం నిలువరించింది. సరిహద్దు వెంట పలు ప్రాంతాలపై పాక్‌ డ్రోన్ల దాడులను భారత్‌ సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది.

Operation Sindhoor

న్యూఢిల్లీ: పాకిస్తాన్ (Pakistan) దాడులపై భారత ఆర్మీ (Indian Army) సోషల్ మీడియా (Social Media) ఎక్స్ (X) వేదికగా పోస్ట్ (Post) చేసింది. ‘‘సరిహద్దుల్లో పాక్ దాడులకు పాల్పడింది.. నియంత్రణరేఖ వెంబడి కాల్పుల విరమణ ఉల్లంఘించింది (Violation).. మిసైల్స్ (Missiles), డ్రోన్ (Drone) దాడులను భారత దళాలు తిప్పికొట్టాయి.. పాక్ కుట్రలకు దీటుగా స్పందిస్తాం.. లాహోర్, షెషావర్, బహల్వాపూర్‌లో.. భారత్ విజయవంతంగా దాడులు చేసింది.. భారత్ దాడుల్లో పాకిస్థాన్ నగరాలు దెబ్బతిన్నాయి.. పాకిస్థాన్ తీవ్రస్థాయిలో నష్టపోయింది’’ అంటూ భారత ఆర్మీ పోస్టు చేసింది.


పాక్‌ డ్రోన్లను కూల్చిన భారత సైన్యం

ఓ పక్క డ్రోన్ దాడులు.. మరోపక్క చొరబాటు ప్రయత్నాలు.. సరిహద్దుల్లో పాక్ సైన్యం దుశ్చర్యలను భారత సైన్యం నిలువరిస్తోంది. సాంబా జిల్లా సరిహద్దు దగ్గర అతిపెద్ద చొరబాటును బీఎస్ఎఫ్ సైన్యం నిలువరించింది. సరిహద్దు వెంట పలు ప్రాంతాలపై పాక్‌ డ్రోన్ల దాడులను భారత్‌ సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. పంజాబ్‌లో పలు ప్రాంతాలపై పాకిస్థాన్ దాడులు చేసింది. ఆ దాడులకు ధీటుగా భారత సైన్యం జవాబిచ్చింది. పఠాన్‌కోట్‌ సెక్టార్‌లో పాక్‌కు చెందిన ఫైటర్‌జెట్‌ను సైన్యం కూల్చివేసింది. జలంధర్‌లో పాక్‌ డ్రోన్లను సమర్థంగా భారత రక్షణ వ్యవస్థ అడ్డుకుంది. పంజాబ్‌‌ోని భటిండాలో పాక్‌ డ్రోన్లను భారత సైన్యం కూల్చివేసింది.

Also Read: యుద్ధ వాతావరణం.. సైరన్లు మోగుతున్నాయి...


రాజస్థాన్‌లోని పలు ప్రాంతాలపై పాక్ దాడులు..

రాజస్థాన్‌లో పలు ప్రాంతాలపై పాకిస్థాన్ దాడులకు తెగబడింది. దాడులకు ధీటుగా భారత సైన్యం జవాబిచ్చింది. పోఖ్రాన్‌ ఆర్మీ స్టేషన్‌పై దాడికి పాకిస్థాన్‌ యత్నించింది. క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లతో దాడికి యత్నించింది. దీంతో భారత రక్షణ వ్యవస్థ పాక్‌ క్షిపణులు, డ్రోన్లను పేల్చేసింది. అలాగే రాజస్తాన్‌లోని జైసల్మేర్ నగరంపై పాక్ డ్రోన్లు, మిసైల్స్ దాడికి తెగబడ్డాయి. అయితే వాటిని భారత సైన్యం విజయవంతంగా నిర్వీర్యం చేసింది. కాగా జైసల్మేర్ గగనతలంలోకి వస్తున్న పాకిస్తానీ డ్రోన్లను భారత సైన్యం నిర్వీర్యం చేస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ సమయంలో ఆకాశంలో పేలుళ్లు సంభవించాయి. సైరెన్లు మోగడం వినిపిస్తోంది. నగరం అంతా విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. ఆ దృశ్యాలను స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

అనంతపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన..

మిస్ వరల్డ్ పోటీలకు వేళాయే...

For More AP News and Telugu News

Updated Date - May 09 , 2025 | 09:36 AM