ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

India: సింధు జలాల ఒప్పందం నిలిపివేత, పాకిస్థానీయులకు నో ఎంట్రీ.. కేంద్రం సంచలన నిర్ణయం

ABN, Publish Date - Apr 23 , 2025 | 09:48 PM

పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంది. 1960లో కుదిరిన ఇండస్ వాటర్ ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. అటారీ చెక్‌పోస్టును తక్షణమే నిలిపివేస్తున్నట్టు ప్రకటించడంతో పాటు పాకిస్థాన్ పర్యాటకులు, పౌరులు వెంటనే వెళ్లిపోవాలని స్పష్టం చేసింది.

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భద్రతా కమిటీ (CSS) సమావేశం తీవ్రంగా ఖండించింది. ఉగ్రదాడులో మృతులకు సంతాపం తెలిపింది. ఉగ్రదాడికి ప్రతిగా కీలక నిర్ణయాలు తీసుకుంది. 1960లో కుదిరిన ఇండస్ వాటర్ ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. అటారీ చెక్‌పోస్టును తక్షణమే నిలిపివేస్తున్నట్టు ప్రకటించడంతో పాటు పాకిస్థాన్ పర్యాటకులు, పౌరులు వెంటనే వెళ్లిపోవాలని స్పష్టం చేసింది. కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలను భారత విదేశంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్తీ మీడియాకు తెలిపారు.

Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడి సూత్రధారి ఇతనే


కీలక నిర్ణయాలివే..

-1960లో కుదిరిన ఇండస్ జల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తోంది. ఇది తక్షణమే అమల్లోకి వస్తోంది. సరిహద్దు ఉగ్రవాదాన్ని పాక్ నిలిపివేసేంత వరకూ ఈ నిర్ణయం అమలు చేయనుంది.

-అటారి (Attari) ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ తక్షణమే మూసివేత. ఇప్పటికే ఆ మార్గం ద్వారా వచ్చిన వారు 2025 మే 1లోగా తిరిగి వెళ్లవచ్చు.

-పాకిస్తాన్ పౌరులకు (SAARC Visa Exemption Scheme-SVES) వీసాలపై భారతదేశ ప్రవేశం నిషిద్ధం. ఇంతకుముందు జారీచేసిన SVES వీసాలు రద్దు. ప్రస్తుతం భారత్‌లో ఉన్న పాక్ పౌరులు 48 గంటల్లోగా దేశం విడిచి వెళ్లాలి.

-న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌లో ఉన్న రక్షణ, సైనిక, నౌకాదళ, వాయుసేన సలహాదారులను ‘పర్సోనా నాన్ గ్రాటా’గా ప్రకటించి, వారిని వారంలోగా దేశం విడిచి వెళ్లమని ఆదేశించింది.

-భారత హైకమిషన్, ఇస్లామాబాద్‌ నుంచి భారత్ తన సలహాదారులను వెనక్కి పిలుపు తీసుకుంది. ఈ పదవులను రద్దు చేసింది. అలాగే 5 మంది సపోర్ట్ స్టాఫ్ కూడా వెనక్కి పిలిపించనుంది.

-భారత్, పాకిస్తాన్ హైకమిషన్లలోని సిబ్బంది సంఖ్యను 55 నుండి 30కి తగ్గించనుంది. ఈ మార్పులు 2025 మే 1లోగా అమల్లోకి వస్తాయి.

- CCS దేశ భద్రతా పరిస్థితిని సమీక్షించింది. అన్ని భద్రతా బలగాలు అత్యంత అప్రమత్తతతో విధులు నిర్వహించాలన్న ఆదేశాలు ఇచ్చింది.

-ఈ ఉగ్రదాడికి పాల్పడిన వారిని చట్టానికి లోబడి శిక్షించడమే కాక, వారికి మద్దతు ఇచ్చిన వారినీ చర్యలను బహిరంగంగా బహిర్గతం చేసి చర్యలు తీసుకుంటామని సంకల్పించింది.

-తహవ్వూర్ రాణాను భారతదేశానికి అప్పగించిన ఉదాహరణను ప్రస్తావిస్తూ, ఉగ్రవాదం పట్ల కఠినమైన ధోరణిని భారత్ కొనసాగిస్తుందని స్పష్టం చేసింది.


ఇవి కూడా చదవండి..

Pahalgam Terror Attack: ఉగ్ర 'వేట' మైదలైంది... జల్లెడ పడుతున్న భద్రతా బలగాలు

Pahalgam Terror Attack: జనసేన మూడు రోజుల సంతాప దినాలు.. జెండాల అవనతం

Pahalgam Terror Attack: ఉగ్రవాదులతో పోరాడిన ఒక్కే ఒక్కడు

Pahalgam Attack: భార్యాపిల్లల కళ్లముందే ఐబీ అధికారిని కాల్చిచంపారు

Updated Date - Apr 23 , 2025 | 09:51 PM