Pahalgam Attack: భార్యాపిల్లల కళ్లముందే ఐబీ అధికారిని కాల్చిచంపారు
ABN , Publish Date - Apr 23 , 2025 | 02:45 PM
లీవ్ ట్రావెల్ కన్సెషన్ (ఎల్‌టీసీ) కింద భార్యాపిల్లలతో విహారయాత్ర కోసం మనీష్ రంజన్ కశ్మీర్ వచ్చారు. మరికొందరితో కలిసి మినీ స్విట్జర్లాండ్‌గా పేరున్న బైసరాన్ వ్యాలీలో బస చేశారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు అతనిని భార్య, పిల్లల కళ్ల ముందే కాల్చిచంపారు.
శ్రీనగర్: పహల్గాంలో ఉగ్రవాదుల నరమేథం యావద్దేశాన్ని కలిచివేసింది. పాక్ ప్రేరేపిత సాయుధ దుండగలు 3 నుంచి 5 నిమిషాల్లో విచక్షణారహితంగా అత్యంత సమీపం నుంచి కాల్పులు జరిపి క్షణాల్లో మాయమయ్యారు. మంగళవారంనాడు జరిగిన ఈ మారణహోమంలో హైదరాబాద్ నుంచి కశ్మీర్ వచ్చిన ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) అధికారి మనీష్ రంజన్ అశువులు బాసారు. మనీష్ రంజన్ బీహార్‌వాసి.హైదరాబాద్‌లోని ఐబీ కార్యాలయంలో మినిస్టీరియల్ సెక్షన్‌లో పనిచేస్తున్నారు.
Pahalgam Terror Attack:మళ్లీ సర్జికల్ స్ట్రైక్ తప్పదా..
లీవ్ ట్రావెల్ కన్సెషన్ (ఎల్‌టీసీ) కింద భార్యాపిల్లలతో విహారయాత్ర కోసం మనీష్ రంజన్ కశ్మీర్ వచ్చారు. మరికొందరితో కలిసి మినీ స్విట్జర్లాండ్‌గా పేరున్న బైసరాన్ వ్యాలీలో బస చేశారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు అతనిని భార్య, పిల్లల కళ్ల ముందే కాల్చిచంపారు. దీంతో ఆయన కుటుంబసభ్యులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.
సీఎంల ఖండన
ఈ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రవాదుల పిరికింపద చర్యను ఖండించారు. ఉగ్రమూకలపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఈ దాడిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు తీవ్రంగా ఖండించారు. హహల్లాంలో పర్యాటకులపై జరిపిన దాడి అత్యంత పాశవిమకమని అన్నారు. బాధిత కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. బైసరాన్‌లో జరిగిన ఉగ్రదాడి ఘటన తనను విషాదంలో ముంచెత్తిందని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆవేన వ్యక్తం చేశారు. 28 మంది అమాయక టూరిస్టులను చంపి, మరో 20 మందిని తీవ్రంగా గాయపరచడం అత్యంత భయానకమని అన్నారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు.
ఉగ్రవాదానికి తలొగ్గేది లేదు: అమిత్‌షా
ఉగ్రదాడి బాధిత కుటుంబాలను కేంద్ర హోం మంత్రి అమిత్‌షా శ్రీనగర్‌లో పరామర్శించారు. ఘటనా స్థలానికి వెళ్లి మృతులకు నివాళులర్పించారు. ఈ దాడికి పాల్పడిన ముష్కరులను ఎట్టి పరిస్థితిలోనూ వడిచిపెట్టే ప్రసక్తే లేదని చెప్పారు. "భారమైన హృదయంతో మృతులకు అంతిమ నివాళులర్పించారు. ఉగ్రవాదానికి భారత్ తలొగ్గో ప్రసక్తే లేదు. ఇంతటి కిరాతకానికి పాల్పడిన ఏ ఒక్కరినీ వదలిపెట్టేది లేదు" అని అమిత్‌షా ఒక ట్వీట్‌లో తెలిపారు.
ఇవి కూడా చదవండి..