Share News

PM Modi: ఉగ్రవాదుల ఏరివేతకు రంగం సిద్ధం..

ABN , Publish Date - Apr 23 , 2025 | 01:01 PM

కాశ్మీర్‌లో జరిగిన పహెల్‌గామ్‌ ఉగ్రదాడిని చైనా మినహా 20 దేశాలు ఖండించాయి. ఖండించిన దేశాలు.. యునైటెడ్ స్టేట్స్, రష్యా, ఇటలీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇజ్రాయెల్, సైప్రస్, సౌదీ అరేబియా, జపాన్, ఇరాన్, సింగపూర్, అర్జెంటీనా శ్రీలంక, ఫ్రాన్స్, ఉక్రెయిన్, ఎస్టోనియా, డెన్మార్క్, మోల్డోవా, లిథువేనియా, జర్మనీ, గయానా..

PM Modi: ఉగ్రవాదుల ఏరివేతకు రంగం సిద్ధం..
India Action Plan Against Terror

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ (Jammu Kashmir), పీవోకే (POK)లో ఉగ్ర సంస్థలు (Terror).. ఉగ్రవాదులను ఏరివేసేందుకు కేంద్రం రంగం సిద్ధం (India Action Plan Against Terror) చేస్తోంది. బుధవారం ఢిల్లీలో ప్రధాని మోదీ (PM Modi), రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాశ్మీర్‌లో పరిస్థితులను జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ ప్రధానికి వివరించారు. ఈ క్రమంలో త్రివిధ దళాధిపతులతో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ (Rajnath Singh) సమావేశమయ్యారు. అలాగే ఈరోజు సాయంత్రం కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. పహెల్‌గామ్‌(Pahalgam) ఉగ్ర దాడి, ప్రభుత్వం తీసుకున్న చర్యలను అఖిలపక్షానికి వివరించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. కాగా పహెల్‌గామ్‌ దాడిలో కేరళ హైకోర్టు న్యాయమూర్తులు ముగ్గురు తృటిలో తప్పించుకుని బయటపడ్డారు. పహెల్‌గామ్‌ దాడిలో అమెరికాలో తయారైన M4, AK-47/56 తుపాకులతో పాకిస్థానీ ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. స్థానికుల సహకారంతో ఆ దాడిని ఉగ్రవాదులు అమలు చేసినట్లు కేంద్ర నిఘావర్గాల ప్రకటించాయి.

Also Read..: టీడీపీ హయంలో అభివృద్ధి.. జగన్ హయంలో విధ్వంసం..


ఐపిఎల్ ఆటగాళ్ల నివాళి..

కాగా ఇవాళ్టి ఐపిఎల్ మ్యాచ్‌లో ఆటగాళ్లు, అంపైర్లు నలుపు రిబ్బన్లను ధరించి ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారికి నివాళులు అర్పిస్తారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఒక్క నిమిషం మౌనం పాటిస్తారు. ఈ రోజు మ్యాచ్‌లో చీర్ గర్ల్స్ ఉండరని ఈ మేరకు బీసీసీఐ ప్రకటించింది

20 దేశాల ఖండన..

కాశ్మీర్‌లో జరిగిన పహెల్‌గామ్‌ ఉగ్రదాడిని చైనా మినహా 20 దేశాలు ఖండించాయి. ఖండించిన దేశాలు.. యునైటెడ్ స్టేట్స్, రష్యా, ఇటలీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇజ్రాయెల్, సైప్రస్, సౌదీ అరేబియా, జపాన్, ఇరాన్, సింగపూర్, అర్జెంటీనా శ్రీలంక, ఫ్రాన్స్, ఉక్రెయిన్, ఎస్టోనియా, డెన్మార్క్, మోల్డోవా, లిథువేనియా, జర్మనీ, గయానా..


కాగా జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి పెట్రేగిపోయారు. అనంతనాగ్‌ జిల్లాలోని పహెల్‌గామ్‌లో పర్యాటకులే లక్ష్యంగా దాడులకు తెగబడ్డారు. మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసారన్‌ ప్రాంతంలో విహారానికి వచ్చిన వారిపై పాశవిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 27 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇటీవల కాలంలో జమ్మూకశ్మీర్‌లో అతి పెద్ద ఉగ్ర ఘటన ఇదేనని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దల్లా పేర్కన్నారు. ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని మోదీ తన విదేశీ పర్యటన అర్ధాంరంగా ముగించి ఢిల్లీ చేరుకున్నారు. మోదీ ఆదేశాలమేరకు హోంమంత్రి అమిత్ షా కశ్మీర్‌కు వెళ్లారు. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా, సీఎం ఒమర్‌ అబ్దుల్లా, కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్‌ మోహన్‌, నిఘా విభాగం డైరెక్టర్‌ తపన్‌ డేకాతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జమ్మూకశ్మీరు డీజీపీ నళిన్‌ ప్రభాత్‌ పహల్గాం ఉగ్ర దాడి వివరాలను ఆయనకు వివించారు. పహల్గాంలో పరిస్థితిపై ఉన్నతాధికారులతో షా సమీక్షించారు. ఘటనా స్థలానికి వెళ్లి బాధితులను పరామర్శించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణలో కలకలం రేపుతున్న కేసులు

నన్ను కూడా చంపండి అంటే మోదీకి చెప్పుకో అన్నారు

విశాఖ వాసిని వెంటాడి మరీ కాల్చి చంపారు..

For More AP News and Telugu News

Updated Date - Apr 23 , 2025 | 01:01 PM