Share News

Pahalgam Terror Attack: ఉగ్రవాదులతో పోరాడిన ఒక్కే ఒక్కడు

ABN , Publish Date - Apr 23 , 2025 | 03:01 PM

Pahalgam Terror Attack: పహల్గాంలో ఉగ్రవాదులు ఒకే సారి కాల్పులు జరపడంతో.. భయంతో అంతా పరుగులు తీశారు. కానీ ఒకరు మాత్రం ధైర్యంగా ఉగ్రవాదులతో పోరాడాడు. ఆ క్రమంలో వారి చేతిలోని తుపాకీ తీసుకొనేందుకు యత్నించాడు. అందులోభాగంగా వారి తూటాలకు బలయ్యాడు. ఇంతకీ అతడు ఎవరంటే..

Pahalgam Terror Attack: ఉగ్రవాదులతో పోరాడిన ఒక్కే ఒక్కడు
Syed Adil Hussain Shah

శ్రీనగర్, ఏప్రిల్ 23: జమ్మూ కశ్మీర్‌ అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గాంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగపడగా.. పర్యాటకులంతా భయంతో పరుగులు తీశారు. కానీ ఒక్కరు మాత్రం.. ఉగ్రవాదులను ధైర్యంతో ఎదుర్కొన్నాడు. అంతేకాదు.. ఓ ఉగ్రవాది చేతిలోని తుపాకీని లాక్కొనే ప్రయత్నం చేశాడు. ఆ క్రమంలో అతడు సైతం ప్రాణాలు కోల్పోయాడు. అతడి పేరు. సయ్యద్ అదిల్ హుస్సేన్ షా. పహల్గాంలో గడ్డి మైదానానికి తన గుర్రంపై పర్యాటకులను చేరవేస్తాడు. ఆ క్రమంలో మంగళవారం పర్యాటకులను సయ్యద్ అదిల్ హుస్సేన్ షా తీసుకు వచ్చాడు. అతడిని రక్షించే ప్రయత్నంలో సయ్యద్ ప్రాణాలను కోల్పోయాడు. అయితే ఈ ఉగ్రవాదుల దాడిలో మొత్తం 28 మంది మరణించారు. వీరిలో ఇద్దరు విదేశీయులు కాగా.. 25 మంది దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు. కానీ ఒకే ఒక్క స్థానికుడు మాత్రం సయ్యద్ అదిల్ హుస్సేన్ షా మాత్రమే.


అయిత అతడి కుటుంనికి అదిల్ షానే జీవనాధారం. అతడి తల్లిదండ్రులతోపాటు భార్య పిల్లలు ఉన్నారు. అదిల్ షా మరణంతో.. ఆ కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది. న్యాయం చేయాలని ఆ కుటుంబం ప్రభుత్వాన్ని కోరింది.


కుమారుడి మృతిై సయ్యద్ హైదర్ షా మాట్లాడుతూ.. తన కుమారుడు పని మీద మంగళవారం పహల్గామ్ వెళ్లాడు. మధ్యాహ్నం 3.00 గంటల ప్రాంతంలో దాడి గురించి తమకు తెలిసిందని చెప్పారు. అతడికి ఫోన్ చేస్తే.. స్విచ్‌డ్ ఆఫ్ వచ్చింది. సాయంత్రం 4.40 గంటలకు మరోసారి ఫోన్ చేస్తే.. రింగ్ అయింది కానీ ఎవరు లిఫ్ట్ చేయలేదు. ఈ నేపథ్యంలో తామంతా పోలీస్ స్టేషన్‌కు వెళ్లామని.. అక్కడ తన కుమారుడు మరణించినట్లు పోలీసులు చెప్పారన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

Pahalgam Terror Attack: మళ్లీ సర్జికల్ స్ట్రైక్ తప్పదా..

Pahalgam Terror Attack: ఉగ్రవాదుల చిత్రాలు విడుదల చేసిన నిఘా వర్గాలు

Pahalgam Terror Attack: మృతులకు అమిత్ షా ఘన నివాళి.. హెల్ప్‌ లైన్ నెంబర్లు విడుదల..

Pahalgam Terror Attack: వేడుక కోసం వెళ్లి.. విగత జీవిగా మారిన ఎస్‌బీఐ ఉద్యోగి

Pahalgam Terror Attack: కాల్పులు జరిపిన ఉగ్రవాది ఫొటో విడుదల

Pahalgam Terror Attack: జస్ట్..పెళ్లయిన ఐదు రోజులకే..

Pahalgam Terror Attack: నేడు బంద్.. పహల్గాంలో కాల్పుల వెనుక ఉంది అతడే..

Pahalgam Terror Attack: జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పులు.. వైరల్‌గా మారిన వీడియోలు

For National News And Telugu News

Updated Date - Apr 23 , 2025 | 03:02 PM