Share News

Pahalgam Terror Attack: మృతులకు అమిత్ షా ఘన నివాళి.. హెల్ప్‌ లైన్ నెంబర్లు విడుదల..

ABN , Publish Date - Apr 23 , 2025 | 11:45 AM

Pahalgam Terror Attack: పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన మృతదేహాలను కేంద్ర మంత్రి అమిత్ షా సందర్శించారు. అనంతరం ఆ యా మృతదేహాలకు ఆయన ఘన నివాళులర్పించారు. ఆ తర్వాత బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు.

Pahalgam Terror Attack: మృతులకు అమిత్ షా ఘన నివాళి.. హెల్ప్‌ లైన్ నెంబర్లు విడుదల..
Home Minister Amith Shah

శ్రీనగర్, ఏప్రిల్ 23: జమ్మూ కశ్మీర్‌ అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గాంలో ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఘన నివాళులర్పించారు. గురువారం శ్రీనగర్‌లోని పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద ఉంచి ఆ యా మృతదేహాల వద్ద పుష్ప గుచ్చాలు ఉంచి వారికి ఆయన నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. వారిని ఓదార్చారు. ఈ ఘటనపై వివరాలను కేంద్ర మంత్రి అమిత్ షా వారిని అడిగి స్వయంగా తెలుసుకొన్నారు. ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని వారికి ఈ సందర్భంగా కేంద్ర మంత్రి భరోసా ఇచ్చారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో విడిచి పెట్టుదని వారికి ఆయన స్పష్టం చేశారు.

హెల్ప్ లైన్ నెంబర్లు..

  • ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ శ్రీనగర్: 0194-2457543, 0194-2483651; 7006058623;

  • 24x7 టూరిస్ట్ హెల్ప్ డెస్క్: పోలీస్ కంట్రోల్ రూమ్, అనంత్ నాగ్: 9596777669, 01932-225870, వాట్సప్ నెంబర్ : 9419051940;

  • జమ్మూ కశ్మీర్ టూరిస్ట్ డిపార్ట్‌మెంట్:8899931010, 8899941010, 9906663868, 9906906115.

ఏప్రిల్ 22వ తేదీ మధ్యాహ్నం పహల్గాంలోని బైసరన్ మైదాన ప్రాంతం దేశ విదేశీ పర్యాటకులతో నిండిపోయింది. అదే అదనుగా భావించిన పలువురు ముష్కరులు.. సైన్యం దుస్తులతో తుపాకీలతో పర్యాటకులపైకి కాల్పులకు తెగబడుతూ దూసుకు వచ్చారు. దీంతో మైదాన ప్రాంతం కావడంతో.. పర్యాటకులకు తప్పించుకొనే అవకాశం లేకుండా పోయింది. దీంతో 26 మంది మరణించారు.


పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న సైన్యం వెంటనే రంగంలోకి దిగింది క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించింది. మరోవైపు ఈ దుశ్చర్యకు పాల్పడిన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతోన్నాయి. అయితే ఈ ఘటనకు తమదే బాధ్యత అంటూ ఇప్పటికే లష్కరే తోయిబా ప్రకటించింది. ఈ సంస్థకు చెందిన టాప్ కమాండర్ ఖలీద్.. ఈ ఘటనకు ప్రధాన సూత్రదారిని నిఘా వర్గాలు గుర్తించాయి.


ఈ ఘటనపై సమాచారం అందుకొన్న ప్రధాని నరేంద్ర మోదీ.. తన పర్యటనను అర్థాంతరంగా నిలిపి వేసి.. స్వదేశానికి తిరిగి వచ్చారు. అనంతరం ఎయిర్ పోర్ట్‌లోనే నిఘా వర్గాలకు చెందిన ఉన్నతాధికారులతో ఆయన సమావేశమై.. జమ్మూ కశ్మీర్‌లోని పరిస్థితిపై చర్చించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

Pahalgam Terror Attack: వేడుక కోసం వెళ్లి.. విగత జీవిగా మారిన ఎస్‌బీఐ ఉద్యోగి

Pahalgam Terror Attack: కాల్పులు జరిపిన ఉగ్రవాది ఫొటో విడుదల

Pahalgam Terror Attack: జస్ట్..పెళ్లయిన ఐదు రోజులకే..

Pahalgam Terror Attack: నేడు బంద్.. పహల్గాంలో కాల్పుల వెనుక ఉంది అతడే..

Pahalgam Terror Attack: జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పులు.. వైరల్‌గా మారిన వీడియోలు

For National News And Telugu News

Updated Date - Apr 23 , 2025 | 01:36 PM