Share News

Pahalgam Terror Attack: జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పులు.. వైరల్‌గా మారిన వీడియోలు

ABN , Publish Date - Apr 23 , 2025 | 07:54 AM

Pahalgam Terror Attack: జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. ఉగ్రవాదుల కాల్పుల్లో పలువురు మరణించారు. ఈ మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. అయితే ఈ ఘటన జరిగిన ప్రాంతంలో పలు వీడియోలు వైరల్‌గా మారాయి.

Pahalgam Terror Attack: జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పులు.. వైరల్‌గా మారిన వీడియోలు

శ్రీనగర్, ఏప్రిల్ 23: జమూ కశ్మీర్‌ పహల్గాం జిల్లాలోని బైసరన్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ప్రస్తుతం మృతుల సంఖ్య 28కి చేరగా.. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని సమాచారం. అయితే ఉగ్రవాదులు కాల్పులకు తెగబడిన సమయంలో పలువురు తృటిలో తప్పించుకున్నారు.అది కూడా నిమిషాల వ్యవధిలోనే కావడం గమనార్హం. అందుకు సంబంధించిన వీడియోలు.. మీడియాలో.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఓ వీడియోలో ఓ వ్యక్తి నడుస్తుండగా.. ఆ సమీపంలో నుంచి కాల్పుల మోతలు, అరుపులు, ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. ఇక మరో వీడియోలో అదే వ్యక్తి మాట్లాడుతూ..ఉగ్రదాడి జరిగిందని చెబుతూ.. ఈ దాడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించానని తెలిపారు. ఈ దాడి నుంచి తాను తృటిలో తప్పించుకొన్నానని చెప్పారు. తన ప్రాణాలు కాపాడినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. అలాగే ఇతరుల భద్రత కోసం ప్రార్థనలు చేస్తున్నానని సదరు వీడియోలో పేర్కొన్నారు.


జమ్మూ కశ్మీర్‌ పహల్గాం జిల్లాలో బైసరన్ ప్రాంతంలో దేశ విదేశీ పర్యాటకుల పర్యటిస్తున్నారు. ఆ క్రమంలో మంగళవారం ఒక్కసారిగా సైనిక దుస్తులు ధరించిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో 28 మంది మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే బైసరన్ మైదాన ప్రాంతం కావడంతో.. ఈ పర్యాటకులు తప్పించుకొనేందుకు మరో మార్గం లేకపోయింది.


ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య పెరిగింది. మరోవైపు విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఈ ఘటనపై సమాచారం అందుకొన్న వెంటనే.. దుబాయ్ పర్యటనను కుదించుకొని.. భారత్‌ తిరిగి వచ్చేశారు. ఈ ఉగ్ర దాడి నేపథ్యంలో బుధవారం కేంద్ర కేబినెట్ అత్యవసరంగా సమావేశం కానుంది. అలాగే పెహల్గాం జిల్లాలో జరిగిన ఈ దాడిని ప్రపంచంలోని పలు దేశాలు ముక్తకంఠంతో ఖండించాయి.

ఇవి కూడా చదవండి:

PM Modi: ప్రధాని మోదీ సౌదీ టూర్ రద్దు..ఇండియాకు వచ్చేసిన పీఎం


TRAI: సిగ్నల్, నెట్ లేకపోతే సైలెంట్ కాదు..ఫిర్యాదు చేయడం మరింత ఈజీ తెలుసా..

Google CCI: గూగుల్ కీలక నిర్ణయం..ఆ కేసు పరిష్కారం కోసం రూ.20.24 కోట్లు చెల్లింపు

Scam Payments: మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్.. జర జాగ్రత్త..

For National News And Telugu News

Updated Date - Apr 23 , 2025 | 08:09 AM