Share News

Pahalgam Terror Attack: కాల్పులు జరిపిన ఉగ్రవాది ఫొటో విడుదల

ABN , Publish Date - Apr 23 , 2025 | 10:27 AM

Pahalgam Terror Attack: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గంలో కాల్పులకు తెగబడిన ఉగ్రవాదుల్లో ఒకరి ఫొటోను ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 5 నుంచి ఆరుగురు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. వారిలో ఒకరి ఫొటోను విడుదల చేసింది.

Pahalgam Terror Attack: కాల్పులు జరిపిన ఉగ్రవాది ఫొటో విడుదల

శ్రీనగర్, ఏప్రిల్ 23: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో పెట్రేగిపోయిన ఉగ్రవాదులు జాడను కనుగొనేందుకు ప్రభుత్వం ముమ్మర చర్యలు చేపట్టింది. అందులోభాగంగా ఈ కాల్పులకు తెగబడిన ఉగ్రవాదుల్లో ఒకరి ఫొటోను ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. ఏకే 47 తుపాకీ చేత పట్టుకొని.. బూడిద రంగు కుర్తా ఫైజమా వేసుకున్న ఓ వ్యక్తి ఫొటోను విడుదల చేసింది. ఈ ఘటనలో కాల్పులకు తెగబడిన వారిలో తొలి ఫొటో ఇదే కావడం గమనార్హం. అయితే ఈ ఘటనకు స్కెచ్ వేసిన.. లష్కరే తోయిబా టాప్ కమాండర్ సైఫుల్లా కసౌరి అలియాస్ ఖలీద్‌తోపాటు రావల్‌కోట్‌కు చెందిన మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు నిఘా వర్గాలు ఇప్పటికే స్పష్టం చేసిన విషయం విధితమే.

అదీకాక ఈ కాల్పుల ఘటనకు తామే బాధ్యులమంటూ పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరీ తోయిబా ఇప్పటికే ప్రకటించుకొంది. మరోవైపు ఈ కాల్పులకు బాధ్యులై వారిని పట్టుకొనేందుకు సైన్యం, భద్రతా దళాలు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఇక ప్రత్యక్ష సాక్షలు కథనం ప్రకారం.. చెట్ల పొదల నుంచి సైనిక దుస్తులతో ఉగ్రవాదులు దూసుకు వచ్చి.. కాల్పులకు తెగ బడ్డారని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. అయితే ఉగ్రవాదులు తరుముకొస్తున్న సమయంలో.. మైదాన ప్రాంతం కావడంతో.. పర్యాటకులు చెట్టుల చాటుకు వెళ్లి దాక్కునేందుకు వీలు లేక పోయిందని వారు వివరించారు.


ఈ కాల్పుల ఘటనను సీఎం ఒమరు అబ్దుల్లా ఖండించారు. ఇది సిగ్గు మాలిన చర్యగా ఆయన అభివర్ణించారు. అలాగే మిగతా రాజకీయ పార్టీలు సైతం ఈ దాడిని ఖండించాయి. అంతేకాకుండా.. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు పిలుపు నిచ్చాయి. ఈ బంద్‌కు సహాకరించాలని ప్రజలకు విజ్జప్తి చేశాయి.

ఇంకోవైపు ఈ ఘటనపై సమాచారం అందుకోన్న వెంటనే. .దుబాయ్‌లో తన పర్యటనను అర్థంతరంగా ప్రధాని మోదీ ముగించారు. అనంతరం స్వదేశానికి తిరిగి వచ్చారు. ఆ వెంటనే భద్రత సలహాదారు అజిత్ దోవల్‌‌తోపాటు ఇతర ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ సమావేశమై.. జమ్మూ కశ్మీర్‌లో శాంతి భద్రతలను సమీక్షించారు. అదీకాక మరికాసేపట్ల కేబినెట్ కమిటి ఆన్ సెక్యూరిటీ అధికారులతో సైతం ప్రధాని మోదీ సమావేశం కానున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

Pahalgam Terror Attack: జస్ట్..పెళ్లయిన ఐదు రోజులకే..

Pahalgam Terror Attack: నేడు బంద్.. పహల్గాంలో కాల్పుల వెనుక ఉంది అతడే..

Pahalgam Terror Attack: జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పులు.. వైరల్‌గా మారిన వీడియోలు

For National News And Telugu News

Updated Date - Apr 23 , 2025 | 10:33 AM