Pahalgam Terror Attack: జస్ట్..పెళ్లయిన ఐదు రోజులకే..
ABN , Publish Date - Apr 23 , 2025 | 09:58 AM
Pahalgam Terror Attack: పెళ్లయి జస్ట్ ఐదు రోజులు మాత్రమే అయింది. వివాహ రిసెప్షన్ అయి మూడు రోజులు అయింది. అనంతరం హనీమూన్ కోసం ఆ జంట జమ్మూ కశ్మీర్‌కు వచ్చింది. అయితే ఉగ్రవాదులు కాల్పులకు తెగబడతారనే విషయం ఆ జంటకు తెలియలేదు.

శ్రీనగర్, ఏప్రిల్ 23: వివాహమై.. జస్ట్ ఐదు రోజులు మాత్రమే అయింది. హనీమూన్ కోసం మినీ స్విట్జర్లాండ్ పహల్గాంకు వినయ్ నర్వాల్ దంపతులు వచ్చారు. అందులోభాగంగా మంగళవారం బైసరన్ మైదాన ప్రాంతంలోని అందాలు ఆస్వాధించేందుకు వారు విచ్చేశారు.ఆ క్రమంలో అక్కడ బేల్ పూరీ తింటున్నారు. ఇంతలో సైనిక దుస్తులు వేసుకోన్న ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఆ క్రమంలో మీది ఏ మతమంటూ కాల్పులు జరుపుతోన్న వ్యక్తి ప్రశ్నించడంతో.. ఆ ప్రశ్నను అర్థం చేసుకోనే లోపే.. తుపాకీ గురి పెట్టి కాల్పులు జరిపారు. దీంతో భర్త శరీరంలోని తూపాకీ గుళ్లు దూసుకెళ్లాయి. దాంతో జరగాల్సిన దారుణం రెప్పపాటులో జరిగిపోయింది. కొద్ది రోజుల క్రితమే మూడు మూళ్లు వేసిన తన భర్త వినయ నర్వాల్ అలా విగత జీవిగా పడి ఉండడాన్ని.. ఆమె తట్టుకోలేక పోయింది. ఆ మృతదేహం వద్ద ఆమె గుండెలవిసేలా రోధిస్తోంది. ఈ హృదయ విదారక ఘటన మంగళవారం పెహల్గాంలో చోటు చేసుకుంది.
ఇంతకీ వినయ్ నర్వాల్ ఎవరంటే..
వినయ్ నర్వాల్ స్వస్థలం హర్యానాలోని కర్నల్. భారతీయ నేవీలో లెఫ్టినెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. రెండేళ్ల క్రితమే ఆయన కేరళలోని కొచ్చిలో విధుల్లో చేరారు. ఆయన వివాహం ఏప్రిల్ 16వ తేదీన జరిగింది. వివాహ రిసెప్షన్ 19న జరిగింది. అనంతరం హనీమూన్ కోసం ఈ దంపతులు జమ్మూ కశ్మీర్ వచ్చారు. అయితే వినయ్ నర్వాల్.. తన విధులను అంకిత భావంతో పని చేస్తారని నేవి ఉన్నతాధికారులు వెల్లడించారు. 26 ఏళ్ల వినయ్ నర్వాల్‌కు.. ఎంత భవిష్యత్తు ఉన్న అతడు ఇలా చనిపోవడం పట్ల నేవీ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పహల్గాంలో ఉగ్రవాదులు మంగళవారం జరిపిన కాల్పుల్లో 28 మంది పర్యాటకులు మరణించారు. వారిలో ఇద్దరు విదేశీ పర్యాటకులు సైతం ఉన్నారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని ఉన్నతాధికారులు వెల్లడించారు. మరోవైపు ఈ కాల్పులకు తెగబడిన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతోన్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
Pahalgam Terror Attack: నేడు బంద్.. పహల్గాంలో కాల్పుల వెనుక ఉంది అతడే..
Pahalgam Terror Attack: జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పులు.. వైరల్‌గా మారిన వీడియోలు
For National News And Telugu News