Share News

Pahalgam Terror Attack: వేడుక కోసం వెళ్లి.. విగత జీవిగా మారిన ఎస్‌బీఐ ఉద్యోగి

ABN , Publish Date - Apr 23 , 2025 | 11:13 AM

Pahalgam Terror Attack: ఆయనో స్టేట్ బ్యాంక్ ఉద్యోగి. బుధవారం ఆయన జన్మదినం. దీంతో ముంబైలో ఉద్యోగానికి సెలవు పెట్టి.. జమ్మూ కశ్మీర్‌లో జన్మదిన వేడుకలు జరుపుకొనేందుకు పహల్గాం చేరుకున్నారు. తన జన్మదిన వేడుక.. తనను విగత జీవిగా మారుస్తోందని ఆ ఎస్‌బీఐ ఉద్యోగి అసలు ఊహించలేక పోయాడు.

Pahalgam Terror Attack: వేడుక కోసం వెళ్లి.. విగత జీవిగా మారిన ఎస్‌బీఐ ఉద్యోగి

శ్రీనగర్, ఏప్రిల్ 23: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులే లక్ష్యంగా చేసుకొని ఉగ్రదాడి జరిగింది.ఈ దాడిలో ఇద్దరు మాత్రమే విదేశీ పర్యాటకులు కాగా.. మిగిలిన వారంతా దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వారే. అయితే ఈ కాల్పుల్లో శైలేష్‌భాయ్ కలాథియా (43) కూడా మృతి చెందారు. ఆయన ముంబైలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో పని చేస్తున్నారు. ఏప్రిల్ 23వ తేదీ శైలేష్ భాయ కలాథియా పుట్టిన రోజు. ఈ సందర్భంగా తన పుట్టిన రోజు వేడుకలను మిని స్విట్జర్లాండ్‌ పహల్గంలో జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ క్రమంలో ఏప్రిల్ 22వ తేదీనే ఆ కుటుంబం అక్కడికి చేరుకుంది.

పహల్గం ఆందాలు వీక్షించేందుకు ఆ కుటుంబం బయటకు వచ్చింది. ఇంతలో ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో శైలేష్ భాయ్ కలాథియా మరణించారు. ఇక ఆయన భార్య, కుమార్తె, కుమారుడితోపాటు కజిన్ సైతం సురక్షితంగా ఉన్నారు. ఈ మేరకు ఎస్‌బీఐ ఉన్నతాధికారులు వెల్లడించారు. శైలేష్ భాయ్ కలాథియా స్వస్థలం సురత్‌లోని చుక్కవది అని పేర్కొన్నారు. శైలేష్ భాయ్ కుటుంబానికి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని ఎస్‌బీఐ ఉన్నతాధికారులు వెల్లడించారు.


మరోవైపు జమ్మూ కశ్మీర్‌లోని శాంతి భద్రతలపై ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ సమీక్ష నిర్వహిస్తున్నారు. అలాగే ఈ ఉగ్రదాడికి పాల్పడిన వారిలో ఒకరి ఫొటోను ప్రభుత్వం విడుదల చేసింది. అలాగే ఈ ఘటనకు పూర్తి బాధ్యత తమదేనంటూ లష్కరే తోయిబా ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈ ఘటనకు కర్మ కర్త, క్రియ అంతా ఈ సంస్థకు చెందిన టాప్ కమాండర్ సైఫుల్లా కసౌరి అలియాస్ ఖలీద్‌ అని ప్రభుత్వం ఓ నిర్ధారణకు వచ్చింది. ఈ దాడిని రాజకీయ పక్షాలే కాదు.. ప్రపంచ దేశాలు సైతం ఖండించిన సంగతి తెలిసిందే.

ఈ వార్తలు కూడా చదవండి..

Pahalgam Terror Attack: కాల్పులు జరిపిన ఉగ్రవాది ఫొటో విడుదల

Pahalgam Terror Attack: జస్ట్..పెళ్లయిన ఐదు రోజులకే..

Pahalgam Terror Attack: నేడు బంద్.. పహల్గాంలో కాల్పుల వెనుక ఉంది అతడే..

Pahalgam Terror Attack: జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పులు.. వైరల్‌గా మారిన వీడియోలు

For National News And Telugu News

Updated Date - Apr 23 , 2025 | 11:13 AM