ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Rudrastra: పట్టాలెక్కిన ఆసియాలోనే అతిపొడవైన గూడ్స్ రైలు.. భారత రైల్వే సరికొత్త రికార్డ్..

ABN, Publish Date - Aug 09 , 2025 | 08:05 PM

భారత రైల్వే శాఖ సరికొత్త చరిత్ర సృష్టించింది.తూర్పు మధ్య రైల్వేకు చెందిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ డివిజన్ (DDU డివిజన్) నుంచి దేశంలోనే అతి పొడవైన సరుకు రవాణా రైలు ‘రుద్రాస్త్ర’ను విజయవంతంగా నడిపి కొత్త రికార్డు నెలకొల్పింది. 354 వ్యాగన్లు.. 7 ఇంజిన్లు ఉన్న ఈ గూడ్స్ రైలు పొడువు ఏకంగా 4.5 కి.మీ. ఆసియాలోనే అత్యంత పొడవైన ఈ రైలు గురించి మరిన్ని విశేషాలు..

Asia’s Longest Freight Train Rudrastra

India's Longest Goods Train: భారతీయ రైల్వేలు శాఖ ఒక చారిత్రాత్మక ఘనతను సాధించింది. దేశ చరిత్రలో మొదటిసారి 4.5 కిలోమీటర్ల పొడవున్న సూపర్ గూడ్స్ రైలు ‘రుద్రాస్త్ర’ను విజయవంతంగా పట్టాలెక్కించింది. తూర్పు మధ్య రైల్వే (East Central Railway) పరిధిలోని పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ (DDU) డివిజన్ నుంచి మొదలైన ఈ రైలు.. ధన్‌బాద్ రైల్వే డివిజన్‌కు విజయవంతంగా సరకు చేరవేసి ప్రయాణాన్ని పూర్తి చేసింది. ఇది దేశంలోనే మాత్రమే కాదు. ఆసియాలోనే అతి పొడవైన సరుకు రవాణా రైలు‌గా రికార్డు నెలకొల్పింది.

రుద్రాస్త్ర 54 వ్యాగన్లు, 6 రాక్‌లు7 ఇంజిన్‌లతో కూడిన 4.5 కి.మీ పొడవైన ఈ గూడ్స్ రైలు. 2025 ఆగస్టు 7న, మధ్యాహ్నం 2:20 గంటలకు గంజ్‌ఖ్వాజా స్టేషన్ నుంచి బయలుదేరింది. అద్భుతమైన వేగంతో సుమారు 5 గంటల్లో 200 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించి గర్హ్వా రోడ్ స్టేషన్ చేరుకుంది. ప్రయాణంలో సగటు వేగం గంటకు 40 కిలోమీటర్లు. ప్రస్తుతం ఈ సరకు రవాణా రైలును ప్రయోగాత్మకంగా నడిపారు. త్వరలోనే, రైల్వే శాఖ రుద్రాస్త్ర సాధారణ కార్యకలాపాలకు పచ్చజెండా ఊపనుంది.

ఎలా రూపొందించారు?

ఈ సూపర్ ఫ్రైట్ ట్రైన్‌ను ఆరు ఖాళీ బాక్సన్ ర్యాక్‌లను కలిపి రూపొందించారు. సాధారణంగా ఇవి వేర్వేరు ట్రైన్లుగా నడిపే వీలుండగా, ఈసారి ప్రత్యేకంగా ఒకే ట్రైన్‌గా కలిపారు. దీన్ని నడిపేందుకు మొత్తం ఏడు శక్తివంతమైన ఇంజిన్లు ఉపయోగించారు. ఇది కేవలం ఒక సాధారణ ప్రయోగం కాదు. సరకు రవాణాలో సమయాన్ని, వనరులను ఆదా చేసే వినూత్న ప్రయత్నంగా అభివర్ణించవచ్చు. ఇది భారతీయ రైల్వే చరిత్రలో అతి పెద్ద గూడ్స్ రైలు కావడం గమనార్హం.

సాధారణంగా 6 గూడ్స్ రైళ్లను విడిగా నడిపితే, వేర్వేరు మార్గాలు, సిబ్బంది అవసరం అవుతుంది. కానీ ‘రుద్రాస్త్ర’ ద్వారా అన్నింటిని కలిపి ఒకేసారి నడిపడం వల్ల ట్రాఫిక్‌ తగ్గుతుంది. రుద్రాస్త్ర ద్వారా వనరులను సమర్థవంతంగా ఉపయోగించడంలో, సమయాన్ని ఆదా చేయడంలో రైల్వే శాఖ గొప్ప విజయం సాధించింది. ఈ గూడ్స్ రైలు ప్రయాణానికి సంబంధించిన వీడియోను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తన 'X' (Twitter) ఖాతాలో షేర్ చేశారు. వీడియో షేర్ అయిన వెంటనే ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి.

రుద్రాస్త్ర రైలు కేవలం పొడవులో మాత్రమే కాదు, నూతన ఆలోచన, ప్రయోగాత్మక విజయం అనే కోణాల్లో కూడా ఒక పెద్ద ముందడుగు. భారత రైల్వేలు చరిత్రలో నిలిచిపోయే ఈ ప్రయోగం, భవిష్యత్తులో మరిన్ని మార్గదర్శకమైన ప్రయాణాలకు బాటలు వేస్తుంది. ఈ ప్రయోగం ద్వారా భారతీయ రైల్వేలు లాజిస్టిక్స్ రంగంలో మరో మెట్టు ఎక్కినట్టయింది. భవిష్యత్‌లో ఇటువంటి సూపర్ ఫ్రైట్ రైళ్ల ద్వారా సరుకు రవాణాలో వేగం, సామర్థ్యం రెండూ పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఉద్యోగం పోయిన తర్వాత లోన్ EMIలు చెల్లించాలా? మారటోరియం?

ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 09 , 2025 | 08:18 PM