ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Operation Sindoor: S-400 మామూలు పవర్ కాదు.. ఈ రక్షణ కవచం ఏయే దేశాల్లో ఉందంటే..

ABN, Publish Date - May 09 , 2025 | 08:24 AM

S 400 Sudarshan Chakra: పాకిస్థాన్ దాడుల్ని భారత రక్షణ వ్యవస్థ అలవోకగా తిప్పికొట్టింది. మన అమ్ములపొదిలోని రక్షణ కవచం ఎస్ 400 సుదర్శన చక్ర పాక్ క్షిపణులను మార్గమధ్యలోనే కూల్చేసింది. మరి.. దీని ప్రత్యేకతలతో పాటు ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏయే దేశాల దగ్గర అందుబాటులో ఉందో ఇప్పుడు చూద్దాం..

S 400 Sudarshan Chakra

యుద్ధం కావాలి.. అంటూ విర్రవీగిన పాకిస్థాన్‌కు రియల్ వార్ ఎలా ఉంటుందో చూపిస్తోంది భారత్. పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఆపరేషన్ సిందూర్ స్టార్ట్ చేసిన ఇండియా.. టెర్రరిస్టులతో పాటు వాళ్లకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ వచ్చిన దాయాది దేశం పని పడుతోంది. ఉగ్ర స్థావరాలపై దాడి చేస్తూ, టెర్రరిస్టులను తుదముట్టిస్తూ దడ పుట్టిస్తోంది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్‌కు రివేంజ్‌గా పాక్ భారత్‌పై దాడికి దిగింది. అయితే వాళ్ల అటాక్స్‌ను ఎస్-400 సుదర్శన్ చక్ర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సమర్థంగా అడ్డుకుంది. మన భూభాగంలో భారీ విధ్వంసానికి ప్లాన్ చేసిన దాయాది ప్రయత్నాలను వమ్ము చేసింది. పాక్ మిసైల్స్‌ను మార్గమధ్యలోనే కూల్చేసి భారీ నష్టాన్ని తప్పించింది. మరి.. అంతటి పవర్‌ఫుల్ ఎస్-400 డిఫెన్స్ సిస్టమ్ ఇంకా ఏయే దేశాల్లో ఉంది, దాని ప్రత్యేకతలు ఏంటనేది ఇప్పుడు చూద్దాం..


ఎవరెవరి దగ్గర ఉందంటే..

చైనా: ఎస్-400ను కొనుగోలు చేసిన దేశాల్లో చైనా మొదటిదిగా చెప్పొచ్చు. తమ డిఫెన్స్ సిస్టమ్‌ను బలోపేతం చేసుకోవడంతో పాటు వైమానిక ముప్పు, మిసైల్స్, డ్రోన్ అటాక్స్, ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్స్ దాడుల నుంచి రక్షణ కోసం వీటిని కొనుగోలు చేసింది డ్రాగన్ కంట్రీ.

భారత్: చైనా తర్వాత ఎస్-400ను కొనుగోలు చేసిన దేశంగా ఇండియాను చెప్పొచ్చు. రక్షణ వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచేందుకు వీటిని దిగుమతి చేసుకుంది భారత్. పాకిస్థాన్, చైనా లాంటి ప్రమాదక పొరుగు దేశాలతో ఉన్న ముప్పును దృష్టిలో పెట్టుకొని వీటిని కొనుగోలు చేసింది. దీని కోసం ఏకంగా 5.4 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపుగా రూ.46 వేల కోట్లు)ను ఖర్చు చేసింది భారత ప్రభుత్వం.

టర్కీ: నాటో మెంబర్ అయి ఉండి కూడా రష్యా నుంచి ఎస్-400ను కొనుగోలు చేసింది టర్కీ. ఈ విషయంలో అమెరికా ఆందోళనలు వ్యక్తం చేసింది.


ప్రత్యేకతలు

  • సుదూరంలో ఉన్న క్షిపణులను కూడా కూల్చేయడం ఎస్-400 స్పెషాలిటీ.

  • ఈ రక్షణ వ్యవస్థను రష్యాకు చెందిన అల్మాజ్ సెంట్రల్ డిజైన్ బ్యూరో రూపొందించింది. అక్కడి నుంచి భారత్ దిగుమతి చేసుకుంది.

  • 40 కిలోమీటర్ల నుంచి ఏకంగా 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా తిప్పికొట్టడం దీని ప్రత్యేకత.

  • ఒకే టైమ్‌లో ఏకంగా 80 టార్గెట్లను కూడా ఈ సుదర్శన చక్ర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూల్చేయగలదు.

  • బాలిస్టిక్ మిసైల్స్‌ను కూడా కూల్చేసే సత్తా దీనికి ఉంది.


ఇవీ చదవండి:

కాందహార్‌ సూత్రధారి రవూఫ్‌ హతం

ఆ డ్రోన్లు బెంగళూరులో తయారైనవే

ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ సముద్రంలో శత్రుదుర్భేద్య దుర్గం

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 09 , 2025 | 08:29 AM