ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Chennai News: ఊటీలో పర్యాటక ప్రాంతాల మూసివేత.. కారణం ఏంటంటే..

ABN, Publish Date - Aug 06 , 2025 | 01:52 PM

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో నీలగిరి, కోవై జిల్లాల్లో రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ప్రాంతీయ వాతావరణ పరిశోధనా కేంద్రం హెచ్చరికలతో ఈ రెండు జిల్లాకు రాష్ట్రప్రభుత్వం రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది.

- రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్..

- ఎండీఆర్‌ఎఫ్‌ బృందాలు సిద్ధం

చెన్నై: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో నీలగిరి, కోవై జిల్లాల్లో రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ప్రాంతీయ వాతావరణ పరిశోధనా కేంద్రం హెచ్చరికలతో ఈ రెండు జిల్లాకు రాష్ట్రప్రభుత్వం రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. రుతుపవన ద్రోణి, మరోవైపు బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ప్రభావంతో రాష్ట్రంలోని కోస్తా, కొండ ప్రాంతాల్లో బుధవారం నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది.

దీంతో అప్రమత్తమైన రాష్ట్రప్రభుత్వం కోవై, నీలగిరి జిల్లాల్లో పర్యాటక ప్రాంతాలను మంగళవారం మూసివేయడంతో పాటు ఊటీ మౌంట్‌ రైలు సేవలను తాత్కాలికంగా రద్దుచేసింది. బుధవారం తేని, తెన్‌కాశి జిల్లాల్లో మోస్తరు నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని, దిండుగల్‌, తిరుప్పూర్‌, కృష్ణగిరి, ధర్మపురి(Dharmapuri), సేలం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది.

ఆ మేరకు ఎండీఆర్‌ఎఫ్‌ విభాగం సీఐ దీపక్‌ నేతృత్వంలో 10 మంది సభ్యుల బృందం మంగళవారం ఊటీ(Ooty)లో మకాం వేసింది. కోవై జిల్లా వాల్పారైలో ఇప్పటికే ఎండీఆర్‌ఎఫ్‌ బృందం వరద నివారణ పనులకు సిద్ధంగా ఉంది. భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున పర్యాటక ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

ఆది నుంచీ అక్రమాల ‘సృష్టి’ డాక్టర్‌ నమ్రత చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

నేడు, రేపు భారీ వర్షాలు

Read Latest Telangana News and National News

Updated Date - Aug 06 , 2025 | 01:52 PM