Tungabhadra Project: తుంగభద్రకు భారీగా వరద..
ABN, Publish Date - Jul 04 , 2025 | 12:01 PM
తుంగభద్ర పైభాగం పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తుతోంది. అధిక ప్రమాణంలో జలాశయంలోకి వరద నీరు వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది.
- 20 క్రస్ట్‌గేట్ల ద్వారా నీటి విడుదల
బళ్లారి(బెంగళూరు): తుంగభద్ర పైభాగం పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తుతోంది. అధిక ప్రమాణంలో జలాశయంలోకి వరద నీరు వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రస్తుతం జలాశయానికి 30వేల క్యూసెక్కులకుపైగా నీరు వచ్చి చేరుతుండగా జలాశయం భద్రత దృష్ట్యా 80 టీఎంసీల సామర్థ్యం దాటగానే వచ్చిన నీటిని అలేగా దిగువకు అధికారులు వదులుతున్నారు.
నదిలో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇప్పటికే నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలను బోర్డు అధికారులు అప్రమత్తం చేస్తూ హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం జలాశయం నుంచి 20 క్రస్ట్‌గేట్లను ఒక్కొక్కటి 2.5 అడుగులు ఎత్తి ఒక్కో గేటు నుంచి 2,913 క్యూసెక్కుల చొప్పు మొత్తం 58,260 క్యూ సెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. జలాశయంలో వరద నీరు పెరిగేకొద్దీ మరిన్ని గేట్ల ద్వారా నీటిని వదిలే అవకాశం ఉందని బోర్డు అధికారులు చెబుతున్నారు.
జలాశయం ఎత్తు 1633 అడుగులు ఉండగా, ప్రస్తుతం డ్యామ్‌లో 1625.3 అడుగులకు నీరు చేరిం ది. జలాశయంలోకి 30వేల క్యూసెక్కుల మేర వరద నీరు వచ్చి చేరుతుండగా, సాగునీటి కాలువలతో కలిపి మొత్తం 62,268 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. ప్రస్తుతం డ్యామ్‌లో 79 టీఎంసీల నీ రు నిల్వ ఉన్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. గత ఏడాది ఇదే స మయానికి 1587 అడుగులకు నీరు చేరుకోగా, 10,503 క్యూసెక్కుల ఇన్‌ప్లోతో 16.32 టీఎంసీల నీరు నిలువ ఉన్నట్లు వారు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి.
కాటేదాన్ రబ్బర్ కంపెనీలో అగ్ని ప్రమాదం
రిజర్వేషన్లు అమలు తర్వాతే ఎన్నికలు నిర్వహించాలి
Read Latest Telangana News and National News
Updated Date - Jul 04 , 2025 | 12:01 PM