Pahalgam Attack Plea: పహల్గాం దాడి ఘటనపై న్యాయవిచారణ.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
ABN, Publish Date - May 01 , 2025 | 04:30 PM
Pahalgam attack plea: పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై న్యాయ విచారణ జరపాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ పిటిషన్‌ను విచారించేందుకు నిరాకరించింది.
న్యూఢిల్లీ, మే 01: పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై న్యాయ విచారణ జరపాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ పిటిషన్‌ను విచారించేందుకు నిరాకరించింది. సైనికుల మనోధైర్యాన్ని దెబ్బ తీయకండంటూ పిటిషనర్‌ను కోరింది. గురువారం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈ పిటిషన్ విచారణపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ పిటీషన్ దాఖలు చేసే ముందు ఈ అంశంలోని సున్నితత్వాన్ని చూడాలని పిటీషనర్‌కు సూచించారు. ఈ తరహా ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసేందుకు బాధ్యతతో వ్యవహరించాలంటూ హితవు పలికింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు చేతులు కలిపి పోరాడేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. అందులో మీ కర్తవ్యాన్ని సైతం నిర్వహించాలని పిటీషనర్‌తో పేర్కొన్నారు. అంతేకాదు న్యాయమూర్తుల పని.. వివాదాలపై నిర్ణయం తీసుకోవడమే తప్ప విచారణలు నిర్వహించడం కాదని జస్టిస్ సూర్యకాంత్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
పహల్గాంలో ఉగ్రదాడి జరగడం వల్ల 26 మంది మృతిపై న్యాయ కమిషన్ ఏర్పాటు చేసి.. రిటైర్డ్ న్యాయమూర్తి చేత విచారణ జరపాలంటూ పిటీషనర్ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి పైవిధంగా స్పందించారు.
మనం ఎప్పటి నుండి దర్యాప్తులో నైపుణ్యాన్ని సంపాదించాము? మీరు రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిని దర్యాప్తు చేయమని అడుగుతున్నారు. వారు తీర్పు మాత్రమే చెప్పగలరు. మమ్మల్ని ఆదేశాలు జారీ చేయమని అడగకండని పిటిషనర్‌ను న్యాయమూర్తి మందలించారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో కాకుండా బయట చదువుతోన్న విద్యార్థులపై జరుగుతోన్న దాడులను సైతం ఈ పిటీషన్‌లో స్పష్టం చేయడం పట్ల న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు ఈ దాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణ జరుపుతోన్న సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
Pahalgam Terror Attack: హఫీజ్ సయిద్ భద్రత పెంచిన పాక్
Pahalgam Terror Attack: పహల్గామే కాదు.. ఆ అటాక్ చేసింది కూడా వీరే..
Pehalgam Terror Attack: భారత్‌లోని పాకిస్థానీలకు కేంద్రం గుడ్ న్యూస్
High alert: బంగ్లాదేశ్ సరిహద్దుల్లో హై అలర్ట్.. ఎందుకంటే..
Pehalgam Terror Attack: పాక్‌కు వ్యతిరేకంగా భారత్ మరో కీలక నిర్ణయం
Pakistan: పహల్గాం దాడి నేపథ్యంలో పాక్ కీలక నిర్ణయం
Pahalgam Terror Attack: ఉగ్రదాడిపై కీలక విషయాన్ని వెల్లడించిన ఆదర్శ్ రౌత్
For National News And Telugu News
Updated Date - May 01 , 2025 | 04:30 PM