Share News

Pahalgam Terror Attack: పహల్గామే కాదు.. ఆ అటాక్ చేసింది కూడా వీరే..

ABN , Publish Date - May 01 , 2025 | 02:18 PM

Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్ర దాడి తామే చేశామని లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదికి గతంలో జరిగిన ఘటనలతో సైతం సంబంధాలున్నాయని నిఘా వర్గాలు నిర్ధరించాయి.

Pahalgam Terror Attack: పహల్గామే కాదు.. ఆ అటాక్ చేసింది కూడా వీరే..

న్యూఢిల్లీ, మే 01: పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది మరణానికి కారణమైన ఉగ్రవాదుల్లో పలువురికి గందెర్‌బల్ జిల్లాలో జరిగిన హత్యతో సంబంధం ఉందని నిఘా వర్గాలు గురువారం వెల్లడించాయి. గతేడాది ఏప్రిల్‌లో గందెర్‌బల్ జిల్లా సోనామార్గ్‌లోని జీ మోర్ టన్నెల్ వద్ద ఆరుగురు కార్మికులతో పాటు వైద్యుడిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ దాడిని సైతం లష్కరే తోయిబా సంస్థకు చెందిన ఉగ్రవాదులే చేశారు. అయితే ఈ దాడికి పాల్పడిన వారిలో హషీమ్ ముసా అలియాస్ సులేమాన్‌కు ఇటీవల జరిగిన పహల్గాం ఉగ్రదాడిలో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.

Pakisthan.jpg


2024 అక్టోబర్‌లో జరిగిన ఈ దాడిలో పాల్గొన్న ఉగ్రవాది జునైద్ అహ్మద్ భట్.. అదే ఏడాది డిసెంబర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. ఆ తర్వాత అదే గ్రూప్‌నకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను సైతం సైన్యం కాల్చి చంపింది. అయితే పహల్గామ్ హత్యలలో సైతం ప్రమేయమున్న లష్కర్ తోయిబా ఉగ్రవాది హషీమ్ ముసా అలియాస్ సులేమాన్ జీ మోర్ టన్నెల్ దాడిలో కీలక పాత్ర పోషించాడని నిఘా వర్గాలు తాజాగా నిర్ధారించాయి.

terror.jpg


2024 అక్టోబర్, జీ మోర్ టన్నెల్ దాడి..

జమ్మూ కాశ్మీర్‌ గందెర్‌బల్ జిల్లాలోని సోనామార్గ్‌లో ఓ ప్రైవేట్ కంపెనీ టన్నెల్ నిర్మిస్తోంది. శ్రీనగర్ నుంచి కార్గిల్‌కు కలిపే రహదారిపై టన్నెల్ నిర్మాణం జరుగుతోంది. దీంతో ఉగ్రవాదులు అక్కడికి చేరుకుని కార్మికులతోపాటు వైద్యుడిపై ఉగ్రవాదులు విచాక్షణారహితంగా కాల్పులకు తెగబ్డడారు. ఈ కాల్పుల ఘటనలో ఆరుగురు కార్మికులతోపాటు వైద్యుడు సైతం మరణించారు. అనంతరం అక్కడే ఉన్న నిర్మాణ సంస్థకు చెందిన రెండు వాహనాలను సైతం ఉగ్రవాదుల దగ్దం చేశారు.

tunnel.jpg


ఇటీవల జరిగిన పహల్గాం దాడిలో అత్యధిక ప్రాణ నష్టం జరిగింది. అయితే ఈ దాడికి కొన్ని వారాల ముందే ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 15వ తేదీ లష్కరే తోయిబా ఉగ్రవాదుల బృందం బైసరన్, అరు వ్యాలీ, బెతాబ్ వ్యాలీ, స్థానిక అమ్యూజ్‌మెంట్ పార్కులలోని ఒక దానిని ఎంచుకోవాలని నిర్ణయించింది. ఆ క్రమం సదరు ప్రాంతాల్లో ప్రజలు సైతం అంతగా లేదు. అంతేకాకుండా.. బైసరన్ వ్యాలీ అయితేనే కరెక్ట్ అని వారంతా ఓ నిశ్చయానికి వచ్చారు. ఎందుకంటే.. భద్రత సిబ్బంది ఆ ప్రాంతంలో చాలా తక్కువ ఉండడంతో బైసరన్ వ్యాలీని ఉగ్రవాదులు ఎంచున్నారు. దీంతో అక్కడ పర్యాటకులే లక్ష్యంగా కాల్పులు జరిపారు.

ఈ వార్తలు కూడా చదవండి..

Pehalgam Terror Attack: భారత్‌లోని పాకిస్థానీలకు కేంద్రం గుడ్ న్యూస్

High alert: బంగ్లాదేశ్ సరిహద్దుల్లో హై అలర్ట్.. ఎందుకంటే..

Pehalgam Terror Attack: పాక్‌కు వ్యతిరేకంగా భారత్ మరో కీలక నిర్ణయం

Pakistan: పహల్గాం దాడి నేపథ్యంలో పాక్ కీలక నిర్ణయం

Pahalgam Terror Attack: ఉగ్రదాడిపై కీలక విషయాన్ని వెల్లడించిన ఆదర్శ్ రౌత్

For National News And Telugu News

Updated Date - May 01 , 2025 | 04:33 PM