ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

India Pak Ceasefire: సీజ్‌ఫైర్‌తో అంతా ముగిసినట్టు కాదు.. పాక్ కొత్త మెలిక

ABN, Publish Date - May 13 , 2025 | 08:01 PM

పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ డార్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో సింధు జలాల ప్రస్తావన చేస్తూ దానికి సీజ్‌ఫైర్‌తో ముడిపెట్టారు.

న్యూఢిల్లీ: భారత్ ధాటికి కాల్పుల విరమణ ప్రతిపాదనతో కాళ్లబేరానికొచ్చిన పాకిస్తాన్ ఇప్పుడు కొత్త మెలికను తెరపైకి తీసుకొస్తోంది. పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ డార్ (Ishaq Dar) తాజాగా ఓ ఇంటర్వ్యూలో సింధు జలాల ప్రస్తావన చేస్తూ దానికి సీజ్‌ఫైర్‌తో ముడిపెట్టారు. సింధూ జలాల ఒప్పందానికి సంబంధించిన అపరిష్కృత అంశాల వల్ల కాల్పుల విరమణకు ప్రమాదం ఉందని హెచ్చరించారు.

Col Sophiya: కల్నల్ సోఫియా ఉగ్రవాదుల సోదరంటూ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు


''సింధూ జలాల అంశం పరిష్కరించడంలో భారత్, పాక్ విఫలమైతే కాల్పుల విరమణ ప్రమాదంలో పడుతుంది. అపరిష్కృతంగానే మిగిలిపోతే ఇది యుద్ధ చర్యగా పరిగణించాల్సి వస్తుంది'' అని డార్ వ్యాఖ్యానించారు.


కాగా, భారతదేశం అటు భూతలం, అటు గగనతలంపై విజృంభించి పాక్ మిలటరీకి భారీ నష్టం చేకూర్చింది. దీంతో అంతర్జాతీయంగా వచ్చిన అపఖ్యాతి నుంచి దృష్టి మళ్లించేందుకే డార్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు న్యూఢిల్లీ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేశాయి. ''రక్తం, నీళ్లు కలిసి పారవు'' అంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం రాత్రి దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో నిష్కర్షగా చెప్పారు. ఆ మరుసటి రోజే ఇషాక్ డార్ తాజా వ్యాఖ్యలు చేశారు.


జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు 26 మంది టూరిస్టులను ఇటీవల అమానుషంగా కాల్చిచంపడంతో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. దీనిపై భగ్గుమన్న భారత్ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో పాటు పాక్‌పై పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది. ''ఆపరేషన్ సిందూర్'' పేరుతో పాక్‌, పీఓకేలోని 9 ప్రాంతాల్లో ఉగ్రవాద శిబిరాలను భారత సేన నేలమట్టం చేసింది. 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఇందుకు ప్రతిగా సరిహద్దుల్లో డ్రోన్లు, క్షిపణులతో పాక్ దాడులు జరపడంతో భారత బలగాలు భీకరంగా విరుచుకుపడ్డాయి. దీంతో బెంబేలెత్తిన పాక్ కాల్పుల విరమణ ప్రతిపాదనతో ముందుకు రావడంతో భారత్ అందుకు అంగీకరించింది.


ఇవి కూడా చదవండి..

Operation Sindoor: ఎస్-400తో ప్రధాని మోదీ ... పాకిస్థాన్‌కు హెచ్చరిక సందేశం..
Terrorists Trapped: జుమ్మూలో భారీ ఎన్ కౌంటర్.. ముగ్గురు లష్కర్ ఈ తోయిబా ఉగ్రవాదుల హతం

Operation Sindoor: అణువణువూ జల్లెడ పడుతున్న భారత్.. ఆచూకీ చెబితే 20 లక్షలు

Updated Date - May 13 , 2025 | 08:03 PM