Operation Sindoor: ఎస్-400తో ప్రధాని మోదీ ... పాకిస్థాన్‌కు హెచ్చరిక సందేశం..
ABN , Publish Date - May 13 , 2025 | 03:25 PM
ప్రధాని సందర్శించిన అదంపూర్ ఎయిర్‌బేస్‌ను తుత్తినియలు చేసినట్టు పాక్ ఇటీవల తన అబద్ధాల చిట్టా విప్పింది. అదంపూర్ ఎయిర్ బేస్‌లోని రన్‌వేను తమ క్షిపణులతో దాడి చేశామని, అక్కడే ఉన్న రష్యా తయారు చేసిన ఎస్-400 మిసైల్ డిఫెన్స్ సిస్టంను ధ్వంసం చేశామని బుకాయించింది.
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) 'ఆపరేషన్ సిందూర్' (Operation Sindoor) విజయంపై జాతినుద్దేశించి సోమవారం రాత్రి ప్రసంగించిన కొద్ది గంటలకే మంగళవారం ఉదయం పంజాబ్‌లోని అదంపూర్ ఎయిర్ బేస్‌ను సందర్శించారు. జవాన్లతో మమేకమై సైనిక ఆపరేషన్ వివరాలను అడిగి తెలుసుకుని వారి ధైర్యసాహసాలను అభినందించారు. పాక్ నడ్డివిరిచిన ఎస్-400 (S-400) మిసైల్ బ్రాక్‌డ్రాప్‌లో వీర జవాన్లను ప్రధాని సెల్యూట్ చేస్తున్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రధాని అనూహ్యంగా అదంపూర్ విమానాశ్రయానికి రావడం, ఈ సందర్భంగా విడుదల చేసిన ఫొటోతో పాకిస్తాన్ అడ్డంగా బుక్కయింది. అడ్డగోలుగా అబద్ధాలు ప్రచారం చేసిన పాక్‌కు గట్టి హెచ్చరిక సంకేతాలు పంపినట్లు అయ్యింది.
PM Modi: మోదీ సర్‌ప్రైజ్... ఆదంపూర్ ఎయిర్‌బేస్‌లో జవాన్లను కలిసిన ప్రధాని..
పాక్ అడ్డగోలు అబద్ధాలు
ప్రధాని సందర్శించిన అదంపూర్ ఎయిర్‌బేస్‌ను తుత్తినియలు చేసినట్టు పాక్ ఇటీవల తన అబద్ధాల చిట్టా విప్పింది. అదంపూర్ ఎయిర్ బేస్‌లోని రన్‌వేను తమ క్షిపణులతో దాడి చేశామని, అక్కడే ఉన్న రష్యా తయారు చేసిన ఎస్-400 మిసైల్ డిఫెన్స్ సిస్టంను ధ్వంసం చేశామని బుకాయించింది. అక్కడితో ఆగకుండా ఫైటర్ జెట్లు, రాడార్ సిస్టమ్‌ను ధ్వంసం చేశామని, తమ దాడిలో 60 మంది భారత సైనికులు చనిపోయారనీ ప్రకటించుకుంది.
కాగా, ఇవన్నీ పచ్చి అబద్ధాలను ప్రభుత్వ వర్గాలు కొట్టిపారేశాయి. ఆదంపూర్ బేస్ మార్ఫింగ్ శాటిలైజ్ ఇమేజ్‌లను పాక్ ఉపయోగించుకుందంటూ పాక్ గుట్టురట్టు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం మంగళవారం ఉదయం ఉదంపూర్ బేస్‌ను సందర్శించడం, వారి సాహసాహలకు సెల్యూట్ చేయడం, ఆ సందర్భంలో ఆయన వెనుక ఎస్-400 మిసైల్ కూడా కొట్టొచ్చినట్టు కనపడటంతో పాక్ బుకాయింపులకు సూటిగా ప్రధాని సమాధానం ఇచ్చినట్టయింది. ఎస్-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఫోటో బయటకు విడుదల చేయడంకూడా ఇదే మొదటిసారి. ప్రపంచంలోనే అత్యున్నత డిఫెన్స్ సిస్టమ్‌లో ఒకటిగా ఎస్-400 పేరు ఇప్పటికే మారుమోగుతోంది. గతవారం పాక్ వదలిన అనేక క్షిపణులను ఎస్-400 కుప్పకూల్చి భారత రక్షణరంగం సత్తాను చాటింది.
ఇవి కూడా చదవండి..
Terrorists Trapped: జుమ్మూలో భారీ ఎన్ కౌంటర్.. ముగ్గురు లష్కర్ ఈ తోయిబా ఉగ్రవాదుల హతం
Operation Sindoor: అణువణువూ జల్లెడ పడుతున్న భారత్.. ఆచూకీ చెబితే 20 లక్షలు