ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

OMC Verdict: ఓఎంసీ కేసులో నేడు సీబీఐ కోర్టు తీర్పు

ABN, Publish Date - May 06 , 2025 | 04:34 AM

సీబీఐ కోర్టు ఓఎంసీ కేసులో మంగళవారం (మే 6) తుది తీర్పు ఇవ్వనుంది. ఈ కేసులో గాలి జనార్దన్ రెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహా పలువురు అధికారులు నిందితులుగా ఉన్నారు

  • నిందితుల్లో గాలి జనార్దన్‌రెడ్డి, సబితారెడ్డి

బళ్లారి, మే 5(ఆంధ్రజ్యోతి): ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ (ఓఎంసీ) ఇనుప గనుల అక్రమ తవ్వకాలకు పాల్పడిందన్న కేసులో సీబీఐ కోర్టు 14 ఏళ్ల తర్వాత మంగళవారం తుది తీర్పు వెలువరించనుంది. ఆంధ్ర-కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో, అనంతపురం, బళ్లారి రిజర్వ్‌డ్‌ ఫారెస్ట్‌ ఏరియా, అనంతపురం జిల్లా ఓబుళాపురం రెవెన్యూ గ్రామ పరిధిలోని ఇనుప గనులను ఓఎంసీ అక్రమంగా తవ్విందని అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం రోశయ్య 2009 డిసెంబరు 7న సీబీఐకి ఫిర్యాదు చేశారు. ఓఎంసీలో మైనింగ్‌ కార్యకలాపాలను నిషేధిస్తూ అప్పటి ప్రభుత్వం జీవో 71ను విడుదల చేసింది.


ఓఎంసీ అక్రమాల కేసులో అప్పటి ఓఎంసీ ఎండీ బీవీ శ్రీనివాస్‌రెడ్డిని ఏ-1గా, గాలి జనార్దన్‌ రెడ్డిని ఏ-2గా చేర్చారు. అప్పటి మైనింగ్‌ డైరెక్టర్‌ వాల్మికి రాజగోపాల్‌, అప్పటి ఐఏఎస్‌ అధికారి కృపానందం, గాలి జనార్దన్‌రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి ఎం.అలీఖాన్‌, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై కూడా సీబీఐ కేసు నమోదు చేసింది. 2011లో మొదటి చార్జిషీటు దాఖలు చేసింది. రూ.884.13 కోట్ల ప్రజాధనం లూటీ చేశారని పేర్కొంది. దాదాపు 14 ఏళ్ల తర్వాత కేసు కొలిక్కి వచ్చింది. 219 మంది సాక్షులను విచారించిన సీబీఐ కోర్టు.. 3,400 డాక్యుమెంట్లను పరిశీలించింది. ఎట్టకేలకు మంగళవారం తీర్పు ఇవ్వనుంది.


Read Also: Rahul meets PM Modi : ప్రధాని నరేంద్ర మోదీతో రాహుల్‌ గాంధీ భేటీ

Sonu Nigam: పహల్గాం ఘటనపై సోనూ నిగమ్‌ సంచలన కామెంట్స్.. షాకిచ్చిన పోలీసులు..

India vs Pakistan Missile Power: భారత్‌తో పోలిస్తే పాక్ క్షిపణుల సామర్థ్యం ఎంతంటే..

Updated Date - May 06 , 2025 | 04:34 AM