Budget 2025: బడ్జెట్ డేట్, టైమ్ మార్చేశారు.. ఎందుకంటే..?
ABN, First Publish Date - 2025-01-26T21:15:35+05:30
Budget 2025: మరికొద్ది రోజుల్లో ఆర్థిక బడ్జెట్‌ను కేంద్ర మంత్రి పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. మరి అందుకు సంబంధించిన కీలక అప్ డేట్ మీకు తెలుసా..
Budget 2025: మరికొద్ది రోజుల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 11.00 గంటలకు పార్లమెంట్‌లో 2025 -26 ఆర్థిక సంవత్సరానికి ఆమె బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రిగా ఆమె వరుసగా ఆరో సారి ఈ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. అయితే గతంలో కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్‌లో సాయంత్రం 5.00 గంటలకు ప్రవేశపెట్టేవారు. కానీ ఆ సమయాన్ని ఉదయం 11.00 గంటలకు మార్చారు. అలాగే గతంలో ఫిబ్రవరి మాసం చివరి రోజున.. బడ్జెట్‌ను ప్రవేశ పెట్టేవారు. కానీ దీనిని సైతం ఫిబ్రవరి 1 తేదీకి మార్చారు. ఈ విషయం అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. కేంద్ర ఆర్థిక బడ్జెట్ అంటేనే దేశంపై ప్రభావం చూపుతోంది. అలాంటి బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే సమయం, తేదీ ఎందుకు మార్చారు. దీనిని ఇలా మార్చింది ఎవరు? దీనిని ఎందుకు మార్చారంటే.. మాత్రం గతంలోకి వెళ్లాల్సిందే..
భారత్ పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌ను సాయంత్రం ప్రవేశపెట్టడం అనే అనవాయితీ కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతోంది. అలా సాయంత్రం ఎందుకు బడ్జెట్‌ను ప్రవేశ పెట్టేవారంటే.. భారత్, యూనైటెడ్ కింగ్ డమ్ (లండన్) మధ్య వర్తక, వాణిజ్యం కొనసాగుతోండేది. యునైటెడ్ కింగ్ డమ్ నుంచి భారత్ స్వాతంత్రం సంపాదించుకొన్న సంగతి అందరికి తెలిసిందే. అదీకాక యూనైటెడ్ కింగ్ డమ్ (లండన్), భారత్ దేశాల మధ్య 5.5 గంటలు వ్యత్యాసముంది. దీంతో భారత్‌లో బడ్జెట్ సాయంత్రం ప్రవేశపెడితే.. కాలమానం ప్రకారం లండన్‌లో ఉదయం అయ్యేది. దీంతో భారత్ బడ్జెట్ వల్ల తమకు కలిగే ప్రయోజనాలపై లండన్ చర్చించేది. ఇక ఈ వార్షిక బడ్జెట్‌ను ఫిబ్రవరి మాసం చివరి పని దినం రోజు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేవారు.
Also Read: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్
Also Read: న్యూఢిల్లీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు..
అయితే ఈ అనవాయితీని 1999లో అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ఏర్పడిన కేంద్ర ప్రభుత్వం మార్చేసింది. అటల్ బిహారీ వాజ్ పేయి కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా యశ్వంత్ సిన్హా 1998 నుంచి 2002 వరకు పని చేశారు. ఆయన కేంద్ర ఆర్థిక బడ్జెట్ ఉదయం 11.00 గంటలకు పార్లమెంట్‌కు సమర్పించాలని సూచించారు, దీని వల్ల పార్లమెంట్‌లో మరింత సమాచారంతో కూడిన చర్చ జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు. దీంతో 1999, ఫిబ్రవరి 27వ తేదీన యశ్వంత్ సిన్హా దేశంలో తొలిసారిగా ఉ. 11.00 గంటలకు పార్లమెంట్‌కు బడ్జెట్‌ను సమర్పించారు. నాటి నుంచి ఈ నియమాన్ని అందరు కేంద్ర ఆర్థిక మంత్రులు క్రమం తప్పకుండా పాటిస్తు వస్తున్నారు.
Also Read: ఎవరు ఎన్ని కుట్రలు చేసినా..
Also Read: అసహనానికి పరాకాష్ట.. కేటీఆర్
Also Read : పద్మ పురస్కారంపై స్పందించిన బాలయ్య బాబు
ఇక ఫిబ్రవరి 1వ తేదీకి ఎందుకు మార్చారంటే.. ?
1999 నుండి 2017 వరకు.. అంటే దాదాపు 20 ఏళ్ల పాటు.. ఫిబ్రవరి మాసం చివరి పని దినం రోజు పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టేవారు. కానీ ఈ ఆచారాన్ని 2017లో మార్చారు. నాటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. పార్లమెంట్‌లో బడ్జెట్ ఫిబ్రవరి 1వ తేదీన సమర్పించాలన్నారు. ఎందుకంటే ఫిబ్రవరి మాసం చివరి పని దినం.. వలస రాజ్యాల కాలం నాటి నుంచి వస్తున్న ఆచారమన్నారు.
Also Read: అరిటాకులో భోజనం చేయడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..?
Also Read: కోట్లు ఖర్చు పెట్టి.. కూలిపోయే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించిన కేసీఆర్
ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్‌కు ఆర్థిక బడ్జెట్ సమర్పించాలని నిర్ణయించినట్లు ఆయన వివరించారు. అంతేకాదు.. ఫిబ్రవరి మాసం చివరి రోజున బడ్జెట్ సమర్పిస్తే.. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యే నూతన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విధి, విధానాలను రూపొందించడానికి కేంద్రానికి తగినంత సమయం లభించడం లేదని ఆయన వివరించారు. ఇక అదే ఏడాది.. రైల్వే బడ్జెజ్‌ను సైతం ఆర్థిక బడ్జెట్‌లో విలీనం చేశారు. దీంతో దేశంలో 92 ఏళ్లుగా కొనసాగుతోన్న రైల్వే బడ్జెట్‌కు పుల్ స్టాప్ పడినట్లు అయింది.
For National News And Telugu News
Updated Date - 2025-01-26T21:48:08+05:30 IST