అరిటాకులో భోజనం చేయడం వల్ల చాలా ఆరోగ్య లాభాలున్నాయని పెద్ద వాళ్లు చెబుతున్నారు. వీటిలో భోజనం చేస్తే.. జీర్ణ సమస్యలు రావని వారు పేర్కొంటున్నారు.
గతంలో అంతా భోజనానికి అరిటాకును వినియోగించే వారు. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. విస్తరాకులు వాడుతోన్నారు. అవి కూడా పేపరుతో చేసినవి కావడంతో.. తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతోన్నాయి.
పలు ప్రాంతాల్లో ఇప్పటికే అరిటాకులో భోజనం వడ్డిస్తున్నారు. అలాగే పలు హోటళ్లు, రెస్టారెంట్లలో కస్టమర్లకు అరిటాకుల్లోనే భోజనాలు పెడుతోన్నారు.
వీటిలో భోజనం తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతోంది.
అరిటాకులో భోజనం చేయడం వల్ల వండిన ఆహార పదార్థాలకు రుచి మరింత పెరుగుతోంది. భోజనం కమ్మగా తిన్న భావన కలుగుతుంది.
అరిటాకుపై పలు రకాలు విటమిన్స్, లవణాలు ఉంటాయి. వాటి వల్ల జీర్ణ శక్తి పెరుగుతోంది.
అరిటాకుల్లో భోజనం చేయడం వల్ల బ్రెయిన్, గర్భాశయ, యూరినరీ, ప్రోస్టేట్ తదితర క్యాన్సర్లు దరి చేరవు. పార్కిన్సన్ వ్యాధి సైతం రాదు.
అరిటాకుల్లో భోజనం తినడం వల్ల గ్యాస్, అసిడిటీ తదితర సమస్యలు దరి చేరవు.
వీటిలో భోజనం చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన కూడా తగ్గుతాయి.
ఆహారంలో ఏమైనా సూక్ష్మ క్రిములు ఉంటే చనిపోతాయి. ఈ ఆకులో భోజనం చేస్తే ఆకలి పెరుగుతుంది.