జ్ఞాపకశక్తి మెరుగుపడేందుకు చేసుకోవాల్సిన 6 అలవాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

ముఖ్యమైన పనులకు రోజు వారీ ప్రణాళిక వేసుకోవాలి. రోజూ రాయడం వల్ల విషయాలు గుర్తుంటాయి.

రోజూ రాత్రిళ్లు 6 నుంచి 8 గంటల పాటు నిద్రపోవడం వల్ల మెదడు రీఫ్రెష్ అవుతుంది. 

ప్రతి పనినీ ఒక క్రమపద్ధతిలో చేసుకుంటూ పోవాలి. 

పజిల్స్‌ను పరిష్కరించడం, చదవడం, కొత్త విషయాలు తెలుసుకోవడం అలవాటుగా చేసుకోవాలి.

వ్యాయామం, యోగా చేయడం ద్వారా మెదడుకు రక్తప్రసరణ అవుతుంది. 

పోషకాహారం తీసుకోవడం వల్ల మెదడుకు పోషకాలు అందుతాయి.