ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Pahalgam: జర్నలిస్ట్‌పై బీజేపీ కార్యకర్తల దాడి..

ABN, Publish Date - Apr 24 , 2025 | 06:05 PM

జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లా పహల్గామ్‌లో జర్నలిస్ట్‌పై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లా పహల్గామ్‌లో ఉగ్రవాదుల కాల్పుల ఘటనలో 26 మంది అశువులుబాసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై..

జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లా పహల్గామ్‌లో జర్నలిస్ట్‌పై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లా పహల్గామ్‌లో ఉగ్రవాదుల కాల్పుల ఘటనలో 26 మంది అశువులుబాసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై బీజేపీ కార్యకర్తలు కలిబారి చౌక్‌లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు వెళ్లిన జర్నలిస్ట్ రాకేష్ శర్మ.. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో భద్రతా లోపాలు ఉన్నాయనే అంశంపై శ్నలు లేవనెత్తారని తెలుస్తోంది. ‘‘పహల్గామ్ దాడికి బాధ్యులు ఎవరు ? హోం మంత్రిత్వ శాఖ జవాబుదారీగా లేదా?" అని ఆయన బీజేపీ నాయకులను ప్రశ్నించారు. ఈ క్రమంలోనే అతడిపై దాడి జరిగింది.


అయితే దీనిపై బీజేపీ కార్యకర్తలు మాట్లాడుతూ సదరు జర్నలిస్ట్ ప్రశ్నలు అడిగే క్రమంలో వేర్పాటువాద భాషను ఉపయోగించారని ఆరోపించారు. మరోవైపు ఈ దాడిపై జర్నలిస్ట్ సంఘాలు ఆందోళన దిగడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కథువాలోని షాహిదీ చౌక్‌లో జర్నిలిస్టులు నలబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, అంతవరకూ తాము బీజేపీ కార్యక్రమాలను బహిష్కరిస్తామని ప్రకటించారు. జర్నలిస్ట్ శర్మపై జరిగిన దాడిని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఖండించింది. భద్రతా వైఫాల్యాలను ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అంటూ మండిపడ్డారు. కాగా, ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుీతోంది.

Updated Date - Apr 24 , 2025 | 06:05 PM