BCCI: మరింత మెరుగ్గా ఏర్పాట్లు చేయాల్సింది: బీసీసీఐ
ABN, Publish Date - Jun 05 , 2025 | 11:38 AM
గతంలో ముంబై వేదికగా భారత్ జట్టు టీ 20 కప్ గెలుచుకుందని.. ఆ సమయంలో పరేడ్ నిర్వహించామని.. ఆ సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటన చోటు చేసుకోలేదని బీసీసీఐ తెలిపింది.
బెంగళూరు, జూన్ 05: బెంగళూరులో ఆర్‌సీబీ విజయోత్సవ వేడుకల్లో బుధవారం జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించారు. మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా గురువారం బెంగళూరులో స్పందించారు. ప్రజలకు క్రికెటర్లు అంటే విపరీతమైన అభిమానం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఈ విజయోత్సవ ర్యాలీని మరింత మెరుగ్గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఘటన అనుకోకుండా జరిగిందని చెప్పారు.
ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు బీసీసీఐ తరఫున ఆయన సంతాపం తెలిపారు. అలాగే ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. సరైన జాగ్రత్తలు, సురక్షితమైన భద్రత చర్యలు తీసుకుని ఉండాల్సిందన్నారు. అయితే పలు సందర్భాల్లో కొన్ని లోపాలు స్పష్టంగా కనిపించాయని చెప్పారు. దీంతో ఐపీఎల్ గెలిచిన ఆర్‌సీబీ విజయోత్సవ ర్యాలీ ముగింపు.. అందుకు వ్యతిరేకంగా జరిగిందని చెప్పారు.
ఈ సందర్బంగా గతంలో జరిగిన ఒక సంఘటనను సెక్రటరీ దేవజిత్ సైకియా గుర్తు చేసుకున్నారు. గతంలో రోహిత్ శర్మ సారథ్యంలో భారత్ జట్టు టీ 20 వరల్డ్ కప్‌ను గెలుచుకుంది. అనంతరం ముంబై మహానగరంలో సదరు జట్టు పరేడ్‌ను ఒపెన్ బస్సులో బీసీసీఐ ఆధ్వర్యంలో నిర్వహించామని గుర్తు చేసుకున్నారు. దీనిని వీక్షించేందుకు లక్షలాది మంది ప్రజలు హాజరయ్యారని తెలిపారు. ఈ సందర్భంగా ఏ ఒక్క చిన్న సంఘటన కూడా చోటు చేసుకోలేదని తెలిపారు.
ఈ నేపథ్యంలో గతంలో ముంబైలో జరిగిన ఈ పరేడ్ కంటే.. మరింత మెరుగ్గా బెంగళూరులో ఈ ర్యాలీ నిర్వహించి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. గతేడాది కోల్‌కతాలో కేకేకే విజయం సాధించిందని తెలిపారు. కానీ అక్కడ సైతం ఏమి జరగలేదని చెప్పారు. ఇవి సాజావుగా సాగడానికి స్థానిక అధికారులు, పోలీసులు సంయుక్తంగా కలిసి పని చేశారని ఈ సందర్భంగా బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అమెరికా జోక్యం కోసం కాదు: ఎంపీ శశిథరూర్
ట్రంప్ మరో కీలక నిర్ణయం.. ఆయా దేశాల పౌరులపై నిషేధం
For National News And Telugu News
Updated Date - Jun 05 , 2025 | 11:50 AM