Share News

MP Shashi Tharoor: అమెరికా జోక్యం కోసం కాదు: ఎంపీ శశిథరూర్

ABN , Publish Date - Jun 05 , 2025 | 10:17 AM

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ వైఖరిని ప్రపంచ దేశాల ఎదుట భారత్ ఎండగడుతోంది. ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశిథరూర్ నేతృత్వంలో ఒక ప్రతినిధి బృందం అమెరికాలో పర్యటిస్తుంది.

MP Shashi Tharoor: అమెరికా జోక్యం కోసం కాదు: ఎంపీ శశిథరూర్
MP Shashi Tharoor

వాషింగ్టన్, జూన్ 05: మా తలలపై తుపాకీలు గురి పెట్టిన వారితో చర్చలు జరిపే ప్రసక్తే లేదని కాంగ్రెస్ పార్టీ నేత, ఎంపీ శశి థరూర్ కుండ బద్దలు కొట్టారు. ఉగ్రవాద చర్యలకు పాల్పడుతోన్నంత కాలం పాకిస్థాన్‌తో చర్చలు జరపబోమని ఆయన స్పష్టం చేశారు. అమెరికాలో పర్యటిస్తున్న ఎంపీ శశిథరూర్ బుధవారం నేషనల్ ప్రెస్ క్లబ్‌లో విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా విలేకర్లు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.

ఈ సీమాంతర ఉగ్రవాదాన్ని అమెరికాతో సహా పలు దేశాలకు వివరించామన్నారు. భారత్, పాకిస్థాన్‌ల మధ్య చర్చల కోసం అమెరికా ప్రమేయాన్ని కోరతారా? అని విలేకరి అడిగిన ప్రశ్నకు ఎంపీ శశిథరూర్‌పై విధంగా సమాధానమిచ్చారు. భారత్ పరిస్థితి ఏమిటన్నది అమెరికాకు క్లియర్‌కట్‌గా అర్థమైందన్నారు. భారత్ చర్చలకు సిద్ధంగా ఉందని.. కానీ బలవంతంగా కాదని స్పష్టం చేశారు. పాకిస్థాన్ భూమిపై నుంచి ఉగ్రవాద చర్యలు కట్టడి చేసిన తర్వాతే.. ఏమైనా జరుగుతోందని ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన తెలిపారు.


తమ పర్యటన కేవలం ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న పాకిస్థాన్ వ్యవహార శైలిపై అవగాహన కల్పించడం కోసమేనని పేర్కొన్నారు. అంతేకాని.. భారత్, పాకిస్థాన్‌ల మధ్య అమెరికా మధ్యవర్తిత్వం కోసం కాదన్నారు. ఒక వేళ ఏదైనా మధ్యవర్తిత్వం కావాలనుకుంటే ఆ వ్యవహారాన్ని ప్రభుత్వం చూసుకుటుందని పేర్కొన్నారు. కానీ తమ పరిస్థితిని తెలియజేయడంతోపాటు ఉగ్రవాదంపై ఏ మాత్రం అపోహలకు తావు ఇవ్వకూడదనే ప్రధాన ఉద్దేశ్యంతోనే అమెరికాలో తమ బృందం పర్యటిస్తుందని చెప్పారు. ఇక భారత్ కోసం ఏమైనా చేయాలంటూ ఏ దేశాన్నీ తాము కోరలేదన్నారు. కేవలం పాకిస్థాన్ చేస్తున్న ఉగ్రదాడుల వ్యవహారంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా తమ బృందం పర్యటన సాగుతోందని స్పష్టం చేశారు.


ఏప్రిల్ 22వ తేదీ పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో 26 మంది మరణించారు. ఈ దాడికి తామే కారణమంటూ లష్కరే తోయిబాకు చెందిన అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రెంట్ ప్రకటించింది. దీంతో ఈ ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్ ఉందనే విషయం అందరికి అర్థమైంది. ఆ క్రమంలో పాకిస్థాన్ వైఖరిని ప్రపంచ దేశాల ఎదుట ఎండగట్టాలని భారత్ నిర్ణయించింది. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ నేత, ఎంపీ శశిథరూర్ నేతృత్వంలో ఒక ప్రతినిధి బృందం అమెరికాలో పర్యటిస్తున్న విషయం విదితమే.

ఈ వార్తలు కూడా చదవండి..

లాస్ఏంజెల్స్‌లో ఘనంగా మినీ మహానాడు

ట్రంప్ మరో కీలక నిర్ణయం.. ఆయా దేశాల పౌరులపై నిషేధం

For National News And Telugu News

Updated Date - Jun 05 , 2025 | 11:00 AM