Share News

Donald Trump: ట్రంప్ మరో కీలక నిర్ణయం.. ఆయా దేశాల పౌరులపై నిషేధం

ABN , Publish Date - Jun 05 , 2025 | 08:51 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ క్రమంలో ఆయన తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

Donald Trump: ట్రంప్ మరో కీలక నిర్ణయం.. ఆయా దేశాల పౌరులపై నిషేధం
Donald Trump

న్యూఢిల్లీ, జూన్ 05: అమెరికా దేశాధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 12 దేశాలకు చెందిన పౌరులను యూఎస్‌లోకి అనుమతించకుండా నిషేధం విధించారు. అలాగే మరో ఏడు దేశాలకు చెందిన పౌరులపై ఆయన పాక్షిక నిషేధం విధించారు. అందుకు సంబంధించిన ఆదేశాలు గురువారం వైట్ హౌస్ విడుదల చేసింది.

ఈ ఆదేశాలు జూన్ 9వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. పూర్తిగా నిషేధం విధించిన దేశాల జాబితాలో ఆఫ్ఘనిస్థాన్, బర్మా, చాద్, రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో, ఈక్వటోరియల్ గినీ, హైతీ, ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, యెమెన్, ఎరిత్రియా ఉన్నాయి. అలాగే పాక్షిక నిషేధం విధించిన దేశాల జాబితాలో బురుండి, క్యూబా, లావోస్, టోగో, తుర్కిమిస్థాన్ వెనిజలా, సియెర్రా లియోన్ ఉన్నాయి. అమెరికా, దేశ భద్రతతోపాటు జాతీయ ప్రయోజనాలకు కాపాడటానికి తాను ఈ చర్యలకు ఉపక్రమించినట్లు దేశాధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు.


కొలరాడోలో ఇటీవల యూదులపై సీసా బాంబుతో దాడి జరిగింది. సరైన పత్రాలు లేని విదేశీ పౌరుల వల్లే ఈ తరహా ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆయన భావించారు. 2017లో యూరప్‌లో జరిగిన ఘటన అమెరికాలో పునరావృతం కానీవ్వమని ఆయన స్పష్టం చేశారు. సురక్షితం కానీ దేశాల నుంచి ప్రజలను అనుమతించలేమన్నారు. అందుకే పలు దేశాలకు చెందిన ప్రయాణికులపై నిషేధం విధిస్తున్నానంటూ ట్రంప్ ప్రకటన చేశారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మరోవైపు గతంలో యూఎస్ దేశాధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పుడు పలు ముస్లిం దేశాలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఆ జాబితాలో ఇరాక్, సిరియా, ఇరాన్, సూడాన్, లిబియా, సోమాలియా, యెమన్ దేశాలు ఉన్న విషయం విదితమే.

ఈ వార్తలు కూడా చదవండి..

లాస్ఏంజెల్స్‌లో ఘనంగా మినీ మహానాడు

శ్రీశైలం డ్యాంలో రెండో రోజూ శాస్త్రవేత్తల సర్వే

For National News And Telugu News

Updated Date - Jun 05 , 2025 | 09:34 AM