ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Assembly elections: స్టాలిన్‌పై మాజీసీఎం ధ్వజం.. మీ గురించి మాకు తెలియదా..

ABN, Publish Date - Aug 12 , 2025 | 10:31 AM

తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చి, వాటిని అమలు చేయకుండా ప్రజల్ని మభ్యపెడుతున్న ముఖ్యమంత్రి స్టాలిన్‌ గురించి తమకు బాగా తెలుసని అన్నాడీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ఎద్దేవా చేశారు. డీఎంకే పాలనలో అన్ని రంగాల్లో కుంటుపడిన రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడమే తమ లక్ష్యమని ప్రకటించారు.

- రాష్ట్రాభివృద్ధే తమ లక్ష్యమని ప్రకటన

- వేపనహల్లిలో రోడ్‌ షో

చెన్నై: తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చి, వాటిని అమలు చేయకుండా ప్రజల్ని మభ్యపెడుతున్న ముఖ్యమంత్రి స్టాలిన్‌ గురించి తమకు బాగా తెలుసని అన్నాడీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి(Former Chief Minister Edappadi Palaniswami) ఎద్దేవా చేశారు. డీఎంకే పాలనలో అన్ని రంగాల్లో కుంటుపడిన రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడమే తమ లక్ష్యమని ప్రకటించారు. 2026 అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని ‘మక్కలై కాప్పోం...తమిళగత్తై మీడ్పోం’ అనే నినాదంతో ఈపీఎస్‌ చేపట్టిన రెండో విడత ప్రచారంలో భాగంగా సోమవారం కృష్ణగిరి జిల్లా వేపనహల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో సాగింది.

రాయకోట అన్నా విగ్రహం జంక్షన్‌లో నిర్వహించిన రోడ్‌ షోలో మాజీ మంత్రులు బాలచంద్రారెడ్డి, కేపీ మునుస్వామితో కలసి రోడ్‌ షోలో పాల్గొన్న ఈపీఎస్‌ మాట్లాడుతూ... డీఎంకే ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని విస్మరించిందని, మామిడి పండ్ల దిగుబడిలో కృష్ణగిరి జిల్లా దేశంలోనే అగ్రస్థానంలో ఉందని అయితే, అధిక దిగుబడుల కారణంగా నష్టపోయిన రైతుల నుంచి మామిడి కొనుగోలు చేయకుండా ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు.

అలాగే, రబ్బరు రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేదని, ఈ రెండు డిమాండ్లతో ఇటీవల జిల్లాలో అన్నాడీఎంకే భారీస్థాయిలో ఆందోళన నిర్వహించినట్లు ఈపీఎస్‌ తెలిపారు. హోసూరులో అంతర్జాతీయ ప్రమాణాలతో రూ.20 కోట్లతో అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో నిర్మించిన వేలం కేంద్రాన్ని డీఎంకే ప్రభుత్వం మూసివేసిందని, తాము వచ్చే ఏడాది మళ్లీ అధికారంలోకి వచ్చాక ఈ కేంద్రం ప్రారంభిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

ముఖ్యంగా నీటి వనరుల్లో పూడికతీత జరపడం లేదని, సీనియర్‌ సిటిజన్ల పింఛన్‌ను పెంచలేదని, మహిళలకు అమ్మా స్కూటర్ల పథకాన్ని నిలిపివేసిందని ఈపీఎస్‌ ఆరోపించారు. ఈ నెల 23న చెన్నై శివారు ప్రాంతం షోలింగనల్లూర్‌, తిరుపోరూర్‌ నియోజకవర్గాల్లో నిర్వహించదలచిన తన మూడవ విడత పర్యటన మరో తేదీకి వాయిదావేస్తున్నట్లు ఈపీఎస్‌ మీడియాకు తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి..

గుడ్ న్యూస్, భారీగా తగ్గిన బంగారం ధరలు.. కానీ వెండి మాత్రం..

చట్టాలు తెలుసుకుని అమెరికా రండి

Read Latest Telangana News and National News

Updated Date - Aug 12 , 2025 | 10:31 AM