ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Chennai: అసెంబ్లీ ఎన్నికలకు కొత్త వ్యూహాలు..8న చెన్నైకి అమిత్‌షా

ABN, Publish Date - Jun 21 , 2025 | 11:33 AM

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా జూలై 8న రాష్ట్రంలో పర్యటించనున్నారు. రాష్ట్రంలో ఓటు బ్యాంక్‌ ఎక్కువగా ఉన్న పార్టీలతో ఎన్టీయే మెగా కూటమిని ఏర్పాటు చేయాలనే సంకల్పంతో అమిత్‌షా కొద్ది నెలల క్రితం నగరానికి వచ్చి అన్నాడీఎంకేతో పొత్తు ఖరారు చేసుకున్నారు.

- ఈపీఎస్‌, రాందాస్‏తో భేటీ?

చెన్నై: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా(Amit Shah) జూలై 8న రాష్ట్రంలో పర్యటించనున్నారు. రాష్ట్రంలో ఓటు బ్యాంక్‌ ఎక్కువగా ఉన్న పార్టీలతో ఎన్టీయే మెగా కూటమిని ఏర్పాటు చేయాలనే సంకల్పంతో అమిత్‌షా కొద్ది నెలల క్రితం నగరానికి వచ్చి అన్నాడీఎంకే(AIADMK) తో పొత్తు ఖరారు చేసుకున్నారు. ఆ తర్వాత ఈ నెల 7న మదురైలో పార్టీ నేతలల సమావేశంలో పాల్గొని అసెంబ్లీ ఎన్నికల వ్యూహరచనలపై చర్చలు జరిపారు. అమిత్‌షా రెండురోజుల పర్యటన బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది.

అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే విజయం కోసం ప్రతినెలా రాష్ట్రంలో పర్యటించి పార్టీని ఉత్తేజపరచాలని ఈ సందర్భంగా నాయకులు అమిత్‌ షాను కోరారు. అందుకు సరేనంటూ అమిత్‌షా హామీ ఇచ్చారు. ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్‌ నాగేంద్రన్‌(BJP state president Nainar Nagendran) మీడియాతో మాట్లాడుతూ ఇకపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తరచూ రాష్ట్రంలో పర్యటించి పార్టీని ఉత్తేజపరచనున్నారనిన్నారు.

ఆయన మాటల ప్రకారమే అమిత్‌షా వచ్చే నెల 8న చెన్నై విచ్చేయనున్నారని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఆ పర్యటనలో రాష్ట్రంలో శాసనసభ నియోజకవర్గాలవారీగా పార్టీ పరిస్థితులపై సమీక్ష జరుపనున్నారని తెలుస్తోంది. ఆ సందర్భంగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్)తో ఆయన భేటీ అవుతారు.

ఇక వన్నియార్ల ఓటు బ్యాంక్‌ కలిగిన పీఎంకేని కూటమిలోకి చేర్చేందుకు అమిత్‌షా చర్యలు చేపడతారని, అవసరమైతే ఆ పార్టీ వ్యవస్థాపకుడు రాందా్‌సను కలుసుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం, అమ్మామక్కల్‌ కట్చి నేత టీటీవీ దినకరన్‌ కూడా అమిత్‌షాను కలుసుకుని ఎన్నికల పొత్తు ఖరారు చేసుకుంటారని తెలుస్తోంది.

ఈ వార్తలు కూడా చదవండి.

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

నీటి రక్షణకు కుట్టి రోబోలు

Read Latest Telangana News and National News

Updated Date - Jun 21 , 2025 | 11:33 AM