ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

America junks Mango shipments: కోట్ల విలువైన భారత మామిడి పండ్లు మట్టిపాలు!

ABN, Publish Date - May 18 , 2025 | 08:51 PM

భారతదేశం నుండి ఎగుమతి చేసిన 15 మామిడి పండ్ల షిప్‌మెంట్‌లను అమెరికా రద్దు చేసింది. సదరు సరుకుని తిరిగి ఇండియాకు తీసుకెళ్లాలని ఆదేశించింది. దీంతో ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్నట్టు..

America junks India Mango shipments

అమెరికా: దాదాపు నాలుగున్నర కోట్ల విలువైన భారతదేశ మామిడి పండ్లు మట్టిపాలయ్యే పరిస్థితి తలెత్తింది అమెరికాలో. మన దేశం నుంచి ఎగుమతైన ఈ పండ్లను అమెరికన్ గవర్నమెంట్ తమ దేశంలోకి తీసుకోవడానికి నిరాకరించడమే దీనికి కారణం. ఈ మామిడి పండ్లను వాయుమార్గం ద్వారా భారత్‌కు చెందిన ఎగుమతిదార్లు అమెరికాకు ఎక్స్‌పోర్ట్ చేశారు. అయితే, సరుకు USకు చేరుకున్న తర్వాత అక్కడ వాటిని దిగుమతి చేసుకోవడానికి తిరస్కరించారు. దీంతో సరుకుని దిగుమతి చేసుకోవడానికి లాస్ ఏంజిల్స్, శాన్ ఫ్రాన్సిస్కో, అట్లాంటాతో సహా అన్ని విమానాశ్రయాలు నిరాకరించాయి.

ఇది చాలదన్నట్టు, ఆ మామిడి పండ్ల ఎగుమతిదార్లకు పెద్ద జర్కే ఇచ్చింది అమెరికా ప్రభుత్వం. సదరు సరుకును నాశనం చేయాలని లేదా భారతదేశానికి తిరిగి ఎగుమతి చేయాలని కోరారు. అయితే, త్వరగా పాడయ్యే అవకాశమున్న మామిడి పండ్లను భారతదేశానికి తిరిగి రవాణా చేయడానికి అయ్యే అధిక ఖర్చు కారణంగా వాటిని అక్కడే వదిలెయ్యాలని సదరు ఎగుమతిదార్లు భావిస్తున్నారని తెలుస్తోంది. కాగా, అమెరికాకు మామిడి పండ్ల ఎగుమతిలో భారతదేశందే పైచేయి.

అమెరికాకు ఎక్స్‌పోర్ట్ అయ్యే మామిడిపండ్లలో అతిపెద్ద పాత్ర ఇండియాదే. అయితే, ఈ ఎగుమతి క్రతువులో సదరు షిప్మెంట్స్‌కు రేడియేషన్(ఇరాడియేషన్) ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఇది సరుకు అమెరికాకు ఎక్స్ పోర్ట్ చేయడానికి తప్పనిసరి. ఇది మామిడిపండ్ల తెగుళ్ళను తొలగించడానికి, పండు లైఫ్ పెంచడానికి ఇది ఉపకరిస్తుంది. పండ్లలో ఈ కీటక నివారణ ప్రక్రియను యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియా, యూరోపియన్ యూనియన్ వంటి అనేక దేశాలు దిగుమతి చేసుకునే పండ్లపై కఠినమైన జీవ భద్రతా నిబంధనలను అమలు చేస్తాయి.

మామిడిపండ్లలో కొన్ని కీటకాలు, ముఖ్యంగా ఫ్రూట్ ఫ్లై (Fruit Fly) వంటివి ఉండవచ్చు. ఇవి ఆయా దేశాల వ్యవసాయ వ్యవస్థకు హాని కలిగించవచ్చు. రేడియేషన్ ప్రక్రియ ఈ కీటకాలను నాశనం చేస్తుంది. తద్వారా ఆయా దేశాల్లో సరుకు దిగుమతి చేసుకునేందుకు వీలుకలుగుతుంది.

రేడియేషన్ ప్రక్రియ మామిడిపండ్లలో సూక్ష్మజీవులు (మైక్రోఆర్గానిజమ్స్), పండు కుళ్ళిపోయేందుకు సహకరించే సూక్ష్మక్రిములను నాశనం చేస్తుంది. దీనివల్ల పండ్లు ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. ఇది సుదూర ప్రాంతాలకు రవాణా సమయంలో, ముఖ్యంగా సముద్ర రవాణా సమయంలో పండ్ల నాణ్యతను కాపాడుతుంది.

ప్రస్తుతం ఎగుమతి చేసిన మామిడి పండ్లకు సంబంధించి ఇండియాలో జరిగిన ఈ రేడియేషన్ ప్రక్రియపై సంబంధిత అమెరికా అధికారులు డాక్యుమెంటేషన్‌లో వ్యత్యాసాలను చూపించి సరుకు దిగుమతికి నిరాకరించారు. అయితే, ఇది తమ తప్పుకాదని మే 7, 8 తేదీల్లో ముంబైలో రేడియేషన్ ప్రక్రియ జరిపిన అధికారల తప్పిదమని భారత ఎగుమతిదార్లు వాపోతున్నారు. ఈ ట్రేడ్‌లో తమకు దాదపు నాలుగున్నర కోట్లకు పైగా నష్టం వస్తుందని విచారం వ్యక్తం చేస్తున్నారు.

అయితే, ఈ విషయంపై స్పందించేందుకు భారత వ్యవసాయ, ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ అథారిటీ (APEDA) ఛైర్మన్ కార్యాలయం నిరాకరించింది. ఆ విషయం ముంబైలోని వాషిలో ఉన్న మహారాష్ట్ర రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ బోర్డు (MSAMB)ను సంప్రదించవచ్చని పేర్కొంది.


అటెండర్‌ను చెప్పుతో కొట్టిన మహిళా ఎక్సైజ్ సీఐ


Also Read:

ఎస్-400 లాంటి ఫవర్‌ఫుల్ గగనతల రక్షణ వ్యవస్థలు ఇవే..

RBI: పాకిస్థాన్, గల్ఫ్ దేశాలకు సాయం చేసిన ఆర్బీఐ.. ఎందుకంటే..

తుర్కియే అధ్యక్షుడి ఆధిపత్య ప్రదర్శన.. వేలు పట్టుకుని వదలకుండా..

Read Latest and International News

Updated Date - May 18 , 2025 | 09:00 PM