Erdogan Powerplay: తుర్కియే అధ్యక్షుడి ఆధిపత్య ప్రదర్శన.. వేలు పట్టుకుని వదలకుండా..
ABN , Publish Date - May 18 , 2025 | 04:14 PM
ఫ్రాన్స్ అధ్యక్షుడిపై సైకలాజికల్‌గా పైచేయి సాధించేందుకు తుర్కియే అధ్యక్షుడు చేసిన ప్రయత్నం తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. జనాలు ఈ వీడియోపై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: దేశాధినేతలు తమ ఆధిపత్యం ప్రదర్శించేందుకు రకరకాల ట్రిక్స్ వాడుతుంటారు. అవతలి వారిపై పైచేయి సాధించినట్టు బాడీ లాంగ్వేజ్ ద్వారా పలు పరోక్ష సంకేతాలు ఇస్తుంటారు. ముఖ్యంగా శిఖరాగ్ర సమావేశాల్లో అప్పుడప్పుడూ ఇలాంటి దృశ్యాలు కనిపించాయి. ఇక తాజా ఫ్రాన్స్, తుర్కియే అధ్యక్షుల భేటీలో ఇదే దృశ్యం కనిపించిందంటూ జనాలు నెట్టింట తెగ చర్చించుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
తిరానాలో జరుగుతున్న ఐరోపా పొలిటికల్ కమ్యూనిటీ సమ్మిట్‌లో ఈ ఆసక్తికర సన్నివేశం కనిపించింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో ఐరోపా దేశాలు ఓవైపు, తుర్కియే మరోవైపు అన్నట్టు ప్రస్తుత పరిస్థితి ఉంది. ఈ విషయం తాజా సమావేశంలో కూడా స్పష్టంగా కనిపించింది. రష్యా తీరును ఖండిస్తున్న ఐరోపా దేశాల్లో ఫ్రాన్స్ ముందు వరుసలో ఉంది. పుతిన్ తీరును ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయెల్ మాక్రాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే, తుర్కియే మాత్రం రష్యా విషయంలో మౌనంగా ఉంటోంది. పుతిన్‌పై విమర్శలు ఎక్కుపెట్టట్లేదు. ఈ నేపథ్యంలో తుర్కియే అధ్యక్షుడు ఎర్డొగాన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ సమ్మిట్‌లో తారసపడ్డప్పుడు ఆసక్తికర సన్నివేశం కనిపించింది.
తన సీటులో కూర్చుని ఉన్న తుర్కియే అధ్యక్షుడు ఎర్డొగాన్ వద్దకు వచ్చిన మాక్రాన్ ఆయన భుజంపై చేయి వేసి పరోక్ష పద్ధతిలో తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నట్టు మాట్లాడారు. ఈ విషయం సుతారమూ నచ్చని ఎర్డొగాన్ కూడా అదే రీతిలో స్పందించారు. మాక్రాన్ వేలు పట్టుకున్న ఎర్డొగాన్ ఎంతకీ విడిచిపెట్టకుండా తనదే పైచేయి అనే విషయాన్ని పరోక్షంగా చెప్పే ప్రయత్నం చేశారు. చేయి విడిపించుకునేందుకు మాక్రాన్ కొన్ని క్షణాలు ప్రయత్నించి విఫలమై అక్కడే నిలబడిపోయారు. ఈ సమయంలో ఎర్డొగాన్ ఎటో నిర్లక్ష్యంగా చూస్తూ మాక్రాన్‌తో మాట్లాడారు. చివరకు నెగ్గేది తానే అన్నట్టు మాక్రాన్ వేలిని విడిచిపెట్టారు.
ఇదంతా వీడియోలో చూసిన జనాలు ఇది కచ్చితంగా ఆధిపత్య ప్రదర్శనే అని అన్నారు. దేశాధినేతలు ఒకరినొకరు ఇలాగే డామినేట్ చేసుకుంటారని అంటున్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ వీడియో తెగ ట్రెండవుతోంది. మరి మీరూ దీనిపై ఓ లుక్కేయండి.
Also Read:
ఎస్-400 లాంటి ఫవర్‌ఫుల్ గగనతల రక్షణ వ్యవస్థలు ఇవే..
RBI: పాకిస్థాన్, గల్ఫ్ దేశాలకు సాయం చేసిన ఆర్బీఐ.. ఎందుకంటే..
Abhinandan Vardhaman: అభినందన్ వర్థమాన్‌ను భారత్‌కి పాక్ ఆర్మీ అప్పగించిన తర్వాత ఏమైందంటే..
Colonel Sofiya Qureshi: కల్నల్ సోఫియా వివాదం.. సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు
Read Latest and International News