Home » Turkey
ముస్లిం దేశాల మధ్య సైనిక సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని పాకిస్థాన్ పిలుపునిచ్చింది. ముస్లిం దేశాలు తమ మధ్య ఉన్న విభేదాలను పక్కనపెట్టి, నాటో తరహాలో సామూహిక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కోరారు.
నాటో తరహాలోనే మరో కీలక రక్షణ కూటమి రూపుదిద్దుకుంటోంది. పాకిస్థాన్, సౌదీ అరేబియా, టర్కీ ఇప్పటికే 'మక్కా సంయుక్త రక్షణ ఒప్పందం' కుదుర్చుకున్నాయి. తమ ఒప్పందంలో ఈజిప్ట్ కూడా త్వరలో చేరబోతున్నట్టు టర్కీ విదేశాంగ మంత్రి హకాన్ ఫిదాన్ వెల్లడించారు.
పాకిస్థాన్, సౌదీ అరేబియా, టర్కీ దేశాలు 'మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్'పేరుతో ఒక కీలక రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం మూడు దేశాల్లో ఏ ఒక్క దేశంపై దాడులు జరిగినా, అది మిగిలిన రెండింటిపై జరిగిన దాడిగానే పరిగణిస్తారు.
తుర్కియేలో దారుణం చోటుచేసుకుంది. 17 ఏళ్ల ఓ యువకుడు రెస్టారెంట్‌లో తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో నలుగురు చనిపోగా.. 8 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఆఫ్రికా దేశమైన ఉగాండా సైనికాధిపతి జనరల్ ముహూజీ కైనెరుగాబా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సోమాలియాలో ఇస్లామిక్ మిలిటెంట్ల నుంచి రక్షణ కల్పించడంలో ఉగాండా చేస్తున్న సహాయానికి గానూ ఒక బిలియన్ డాలర్లను, ఒక అందమైన అమ్మాయిని అప్పగించాలని తుర్కియేకు ఆయన హుకుం జారీ చేశారు.
మధ్యఆసియాలో ఘర్షణలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. నాటో సభ్యదేశమైన తుర్కియే వైపు దూసుకువెళ్తున్న ఇరాన్ బాలిస్టిక్ క్షిపణిని నాటో ఎయిర్ అండ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ బుధవారం నాడు ధ్వంసం చేసింది.
తుర్కియే పార్లమెంటులో సభ్యులు రచ్చ చేశారు. కొత్త న్యాయశాఖ మంత్రి నియామకంపై జరిగిన ఘర్షణల్లో నేతలు పరస్పరం దాడి చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
తుర్కియే ఎయిర్‌లైన్స్ విమానం కోల్‌కతాలో బుధవారం నాడు అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఆ సమయంలో విమానంలో 236 మంది ప్రయాణిస్తున్నారు.
ఇటీవల వరుస విమాన ప్రమాదాలతో ప్రయాణికుల్లో భయాందోళన చోటు చేసుకుంటుంది. ముఖ్యంగా విమానాల్లో తలెత్తే సాంకేతిక లోపాలు, వాతావరణ పరిస్థితులు, పైలెట్ తప్పిదాల వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి.
తుర్కియేకు చెందిన రక్షణ రంగ సంస్థ బెయికార్ సంచలనం సృష్టించింది. మానవరహిత ఫైటర్ జెట్ నుంచి ప్రయోగించిన బీవీఆర్ మిసైల్‌తో గగనతలంలోని లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించింది.