Share News

తుర్కియే విమానం ఇంజిన్‌లో మంటలు.. కోల్‌కతాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్

ABN , Publish Date - Feb 04 , 2026 | 06:39 PM

తుర్కియే ఎయిర్‌లైన్స్‌ విమానం కోల్‌కతాలో బుధవారం నాడు అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఆ సమయంలో విమానంలో 236 మంది ప్రయాణిస్తున్నారు.

తుర్కియే విమానం ఇంజిన్‌లో మంటలు.. కోల్‌కతాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
Turkish airlines aircraft

ఖాట్మండు: తుర్కియే ఎయిర్‌లైన్స్‌ (Turkish Airline) విమానం కోల్‌కతాలో బుధవారం నాడు అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఆ సమయంలో విమానంలో 236 మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో 225 మంది ప్రయాణికులు, 11 మంది సిబ్బంది ఉన్నారు.


ఇంజిన్‌లో మంటలు..

సంఘటన వివరాల ప్రకారం, తుర్కియే విమానం టీహెచ్‌వై-727 బుధవారం మధ్యాహ్నం 1.28 గంటలకు ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరింది. టేకాఫ్ అయిన నాలుగు నిమిషాల్లోనే కుడివైపు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. దీనిని గుర్తించిన పైలట్లు వెంటనే ఎయిర్‌పోర్ట్ ‌సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అధికారుల సూచనతో విమానం తిరిగి త్రిభువన్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది. సుమారు 15 నిమిషాలపాటు ఎయిర్‌పోర్ట్‌ను మూసేశారు. తిరిగి అక్కడి నుంచి బయలుదేరిన విమానం ముందుగా నిర్ణయించిన ప్రకారం కోల్‌కతాలోని సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్‌ విమానాశ్రయంలో 2.49 గంటలకు ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. ప్రస్తుతం విమాన తనిఖీలు జరుగుతున్నాయి.


ఇవి కూడా చదవండి..

మోదీ ప్రసంగానికి ముందే లోక్‌సభ వాయిదా

మిత్ర ద్రోహి.. దేశ ద్రోహి.. పార్లమెంట్ వెలుపల రాహుల్ గాంధీ, బీజేపీ ఎంపీ మధ్య వాగ్వాదం..

Updated Date - Feb 04 , 2026 | 07:16 PM