Top Air Defence Systems: ఎస్-400 లాంటి ఫవర్‌ఫుల్ గగనతల రక్షణ వ్యవస్థలు ఇవే..
ABN , Publish Date - May 15 , 2025 | 08:42 PM
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎస్-400 గురించే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని టాప్ గగనతల రక్షణ వ్యవస్థలు ఏవో తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: శత్రుదేశాలు ప్రయోగించిన క్షిపణులు, యుద్ధ విమానాలు, డ్రోన్ల వంటి వాటిని తుత్తునియలు చేసే ఆయుధ వ్యవస్థనే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ లేదా గగనతల రక్షణ వ్యవస్థ అని అంటారు. పాక్ దాడులను దీటుగా తిప్పికొట్టిన ‘ఎస్-400’ సుదర్శన చక్ర గురించి అందరికీ తెలిసిందే. మరి ప్రపంచంలో ఇలాంటి టాప్ గగనతల రక్షణ వ్యవస్థలు ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం.
డేవిడ్ స్లింగ్ వ్యవస్థను అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా అభివృద్ధి చేసుకున్నాయి. 300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలనూ ఇది ధ్వంసం చేయగలదు. 15 కిలోమీటర్ల ఎత్తువరకూ ఉన్న టార్గెట్‌లను నాశనం చేస్తుంది.
రష్యాకు చెందిన ఎస్-300వీఎమ్ వ్యవస్థ బాలిస్టిక్ మిసైళ్లు ధ్వంసం చేసేందుకు ఉద్దేశించినది. దీని రేంజ్ 200 కిలోమీటర్లు. 30 కిలోమీటర్ల ఎత్తు నుంచి వస్తున్న క్షిపణులను ధ్వంసం చేస్తుంది.
అమెరికాకు చెందిన థాడ్ వ్యవస్థ.. శత్రదేశ క్షిపణులను సమర్థవంతంగా తిప్పికొడుతుంది. 200 కిలోమీటర్ల పరిధిలోని 150 కిలోమీటర్ల ఎత్తు వరకూ ఉన్న అన్ని టార్గెట్స్‌ను ధ్వంసం చేస్తుంది. అమెరికా క్షిపణి విద్వంసక వ్యవస్థకు ఇది ఎంతో కీలకం.
ఇక అమెరికాకు చెందిన మరో గగనతల రక్షణ వ్యవస్థ ఎమ్ఐఎమ్-104 పాట్రియట్ కూడా గొప్ప సామర్థ్యం కలది. యుద్ధ విమానాలు, క్రూయిజ్ మిసైళ్లు, టాక్టికల్ బాలిస్టిక్ మిసైళ్ల నుంచి రక్షణ లభిస్తుంది. దీని రేంజ్ 170 కిలోమీటర్లు. గరిష్ఠంగా 24 కిలోమీటర్ల ఎత్తులోని శత్రుదేశ ఆయుధాలను ఇది ధ్వంసం చేయగలదు.
రష్యాకు చెందిన ఎస్-300 స్ఫూర్తితో చైనా హెచ్‌క్యూ-9 గగనతల రక్షణ వ్యవస్థను తయారు చేసింది. దీని రేంజ్ 125 కిలోమీటర్లు. గరిష్ఠంగా 27 కిలోమీటర్ల ఎత్తులోని టార్గెట్‌లను ఇది ధ్వంసం చేయగలదు. యుద్ధ విమానాలు మొదలు క్రూయిజ్ మిసైల్స్ వరకూ అనేక ఆయుధాలను ఇది నాశనం చేస్తుంది.
ఫ్రాన్స్, ఇటలీ సంయుక్తంగా ఆస్టర్ 30 ఎస్ఏఎమ్‌పీ/టీ గగనతల రక్షణ వ్యవస్థను రూపొందించాయి. ఇది థియేటర్ లెవెల్ రక్షణ వ్యవస్థ. గరిష్ఠంగా 120 కిలోమీటర్ల దూరంలో 20 కిలోమీటర్ల ఎత్తున ఉన్న యుద్ధ విమానాలు, మిసైళ్లు, డ్రోన్లను ధ్వంసం చేయగలదు.
ఎమ్ఈఏడీఎస్ అనేది మధ్యశ్రేణి గగనతల రక్షణ వ్యవస్థ. అమెరికా, జర్మనీ, ఇటలీ సంయుక్తంగా దీన్ని నిర్మించాయి. ఇది గరిష్టంగా 70 కిలోమీటర్ల దూరంలో 20 కిలోమీటర్ల ఎత్తున ఉన్న లక్ష్యాలను నాశనం చేస్తుంది. 360 డిగ్రీల రక్షణ కల్పిస్తుంది. రహదారుల పైనుంచీ ప్రయోగించేలా దీన్ని సిద్ధం చేశారు.
ఇజ్రాయెల్, భారత్ కలిసి రూపొందించిన గగనతల రక్షణ వ్యవస్థ బరాక్-8. ఇది గరిష్ఠంగా 100 కిలోమీటర్ల దూరంలో 20 కిలోమీటర్ల ఎత్తున ఉన్న లక్ష్యాలను ఛేదిస్తుంది. 360 డిగ్రీల రక్షణ కల్పించే ఈ వ్యవస్థతో యుద్ధ విమానాలు, మిసైల్స్, డ్రోన్స్‌ను ధ్వంసం చేయొచ్చు.
Also Read:
RBI: పాకిస్థాన్, గల్ఫ్ దేశాలకు సాయం చేసిన ఆర్బీఐ.. ఎందుకంటే..
Abhinandan Vardhaman: అభినందన్ వర్థమాన్‌ను భారత్‌కి పాక్ ఆర్మీ అప్పగించిన తర్వాత ఏమైందంటే..
Colonel Sofiya Qureshi: కల్నల్ సోఫియా వివాదం.. సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు
Read Latest and International News